Movie News

పుష్ప-2లో షాడో విలన్


ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఐతే ఇప్పటికే రిలీజ్ చాలా ఆలస్యం అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం అనుకున్న ప్రకారమే డిసెంబరు 5న ‘పుష్ప-2’ను విడుదల చేయాలని సుకుమార్ అండ్ టీం రేయింబవళ్లు కష్టపడుతోంది. షూట్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. అల్లు అర్జున్-శ్రీలీల మీద ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్లే. మరో పాట, కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఆ ప్యాచ్ వర్క్‌లో ‘పుష్ప-3’కు లీడ్ ఇస్తూ సినిమాను ముగించే సన్నివేశం కూడా ఉంది.

‘పుష్ప’ సినిమాకు, ఆ పాత్రకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పార్ట్-3 తీసినా జనం ఎగబడి చూస్తారనడంలో సందేహం లేదు. ఐతే పుష్ప-1లో ‘పుష్ప-2’లో మెయిన్ విలన్‌గా నటించే ఫాహద్ ఫాజిల్‌ను పరిచయం చేసి తన మీద 20 నిమిషాల కథ నడిపి పార్ట్-2 మీద క్యూరియాసిటీ పెంచేలా చేశాడు సుకుమార్.

మరి పార్ట్-3కి కొత్త విలన్ని పరిచయం చేసి లీడ్ ఇస్తే దానికి హైప్ పెరిగేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో మూడో ‘పుష్ప’లో విలన్ పాత్రధారిగా ఎవరిని పరిచయం చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఐతే ఇందుకోసం కొన్ని పేర్లు పరిశీలించి ఒక బాలీవుడ్ నటుడిని దాదాపుగా ఓకే చేసిన సుకుమార్.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘పుష్ప-3’ చేయడం అంత తేలిక కాదని.. తనకు, బన్నీకి ఉన్న కమిట్మెంట్ల దృష్ట్యా వచ్చే రెండు మూడేళ్లలో సినిమా పట్టాలెక్కకపోవచ్చని.. అలా అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ముందే విలన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదని.. సినిమా చేయాలనుకున్నపుడు అప్పటి అవకాశాలను బట్టి విలన్ పాత్రకు ఆర్టిస్టును ఎంచుకోవచ్చని అనుకున్నారని.. అందుకే పార్ట్-3 లీడ్ సీన్లో ఏ నటుడినీ చూపించరని సమాచారం. కేవలం షాడోలో ఒక పాత్రధారిని చూపించి ప్రేక్షకుల ఊహలకు వదిలేస్తారని ‘పుష్ప-2’ యూనిట్ వర్గాల సమాచారం.

This post was last modified on November 15, 2024 6:18 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago