ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి హిట్ కొట్టి డిమాండ్ తెచ్చుకున్నాక అందరూ వెంటపడతారు. అంతకుముందు నో అన్న వాళ్లే కలిసి సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. ‘వెళ్ళిపోమాకే’ అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు చిన్న స్థాయి స్టార్‌గా ఎదిగిన విశ్వక్సేన్ సైతం గతంలో చాలా రిజెక్షన్స్ ఎదుర్కొన్నవాడే.
తనతో సినిమా చేయడానికి ఒకప్పుడు నో అన్న ఓ హీరోయిన్.. ఇప్పుడు తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయాన్ని అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కాగా.. ఆ చిత్రం ఫలక్‌నుమా దాస్ అట. మలయాళ మూవీ ‘అంగమలై డైరీస్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ తనే హీరోగా నటించడమే కాక డైరెక్ట్ చేశాడు కూడా.
అతడి సరసన ఇద్దరు పేరు లేని హీరోయిన్లు నటించారా చిత్రంలో. ఐతే ముందు ఈ సినిమా కోసం శ్రద్ధానే సంప్రదించినట్లు విశ్వక్ వెల్లడించాడు. ఆ సినిమా చేస్తున్నపుడు తన దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవని.. బస్ టికెట్ వేసుకుని శ్రద్ధా కోసం బెంగళూరుకు వెళ్లి నరేషన్ ఇచ్చానని.. కానీ ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని.. దీంతో బస్సు డబ్బులు వేస్టయ్యాయని ఫీలయ్యానని విశ్వక్ తెలిపాడు.
ఐతే అప్పుడు నో చెప్పిన హీరోయినే ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ చిత్రంలో తనకు జోడీగా నటించిందని.. ఈ విషయం తనకు చాలా కిక్కిచ్చిందని విశ్వక్ తెలిపాడు. ఈ సినిమాలో శ్రద్ధాతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటించింది. విశ్వక్ కెరీర్ మొదలైన తీరు గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఇలాంటి స్టార్ హీరోయిన్లతో మిడ్ రేంజ్ సినిమాలు చేయడం, తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోగలుగుతుండడం పెద్ద విషయంగానే భావించాలి. ‘మెకానిక్ రాకీ’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 15, 2024 6:15 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…