వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద పెద్ద స్టార్లతోనే సినిమాలు చేశాడు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, మహేష్ బాబు, విజయ్… ఇదీ వంశీతో సినిమాలు చేసిన స్టార్ల జాబితా.
మహేష్ బాబుతో చేసిన మహర్షి హిట్టయినా సరే.. రెండేళ్లకు పైగా సినిమా చేయలేకపోయాడతను. కానీ తమిళ టాప్ స్టార్ విజయ్ అతడికి ఛాన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీరి కలయికలో వచ్చిన వారిసు మూవీ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
ఈ చిత్రం రిలీజై రెండేళ్లు కావస్తుండగా.. ఇంకా వంశీ కొత్త చిత్రం పట్టాలెక్కలేదు. అసలీ మధ్య వంశీ సినిమా గురించి అసలు చర్చే లేదు. అతనూ ఎక్కడా కనిపించడం లేదు. అందరూ తనను మరిచిపోతున్న సమయంలో వంశీ ఓ హాట్ న్యూస్‌తో వార్తల్లోకి వచ్చాడు. అతను బాలీవుడ్ లెజెండరీ హీరోల్లో ఒకడైన ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇప్పుడీ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది.
ఆమిర్ కోసం సామాజికాంశాలతో కూడిన ఓ కథను తయారు చేస్తున్నాడట వంశీ. దీనికి సంబంధించి లైన్ ఇంతకుముందే ఆమిర్‌కు చెప్పగా.. ఆయన సానుకూలంగా స్పందించారని.. ఫుల్ స్క్రిప్టుతో రమ్మని చెప్పారని అంటున్నారు.
ఐతే ఇప్పుడు ఫుల్ స్క్రిప్టు రెడీ చేసిన వంశీ.. తన నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆమిర్ దగ్గరికి నరేషన్ కోసం వెళ్తున్నారట. ఆమిర్ అపాయింట్మెంట్ కూడా కన్ఫమ్ అయిందని సమాచారం. ఐతే ఆమిర్‌ను మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. లగాన్, 3 ఇడియట్స్, దంగల్ సహా బాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప గొప్ప సినిమాలు చేశాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. కాకపోతే ఇప్పుడు ఆమిర్ టైం ఏమంత బాగా లేదు.
చివరగా ఆయన చేసిన లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ కావడంతో ఆమిర్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. రెండేళ్లకు పైగా కొత్త సినిమా ఊసే ఎత్తలేదు. గ్యాప్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ కథలు వింటున్నాడు. ఈ క్రమంలోనే వంశీకి ఛాన్స్ ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా స్క్రిప్టును బట్టే ఉంటుంది. మరి ఆమిర్‌ను మెప్పించే స్థాయి స్క్రిప్టు వంశీ రెడీ చేశాడా మరి?
This post was last modified on November 14, 2024 12:02 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…