Movie News

పుష్ప 2 విలన్లతో పెద్ద కథే ఉంది

ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్ పండితుల వల్ల కూడా కాదేమో అనే స్థాయిలో బజ్ అమాంతం పెరిగిపోతోంది.

ఇంకా మూడు వారాలు టైం ఉన్నప్పటికీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని స్థాయిలో 30 వేల టికెట్లకు దగ్గరగా వెళ్లడం చూస్తే ప్రీమియర్ల సమయానికి రికార్డుల ఊచకోత ఎంత ఉంటుందనేది ఊహించడం కష్టం. బెనిఫిట్ షో టికెట్ల కోసం ఏకంగా రాజకీయ నాయకుల ప్రమేయం అవసరమయ్యేలా ఉందంటే పుష్ప యుఫోరియాని అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు ముచ్చటైన విలన్ల సంగతి చూద్దాం.

పుష్ప 1 ది రైజ్ లో ప్రతినాయకుడిగా ఎక్కువ హైలైట్ అయ్యింది భన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాసిల్. అజయ్ ఘోష్ కు స్కోప్ దక్కింది కానీ ఆ పాత్ర మొదటిభాగంలో చనిపోయింది కాబట్టి ఇప్పుడీ సీక్వెల్ లో సునీల్, అనసూయలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కనుందని తెలిసింది.

మొదటి భాగంలో శ్రీవల్లి మీద కన్నేసిన డాలీ ధనుంజయకు కాళ్ళు విరిగిన తర్వాత అతని రివెంజ్ ఎపిసోడ్ ని సుకుమార్ విభిన్నంగా ప్లాన్ చేశారట. వీళ్ళతో పాటు ఈసారి జగపతిబాబు తోడవుతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో కాసేపే కనిపించిన రావు రమేష్ కు ఈసారి పొలిటికల్ యాంగిల్ లో ఎక్కువ లెన్త్ దొరికిందట.

వీళ్ళందరూ ఒక ఎత్తయితే జపాన్ ఎపిసోడ్ లో ఎదురయ్యే కొత్త విలన్లతో పుష్ప క్లాష్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.

విదేశీ నటుల ఎంపికలో సుకుమార్ మార్క్ కనిపిస్తుందని అంటున్నారు. మూడు గంటల సేపు నాన్ స్టాప్ గా షాక్ కు గురి చేసేలా కంటెంట్ ఉంటుందని, పాటలు ఒక్కదాన్ని మించి మరొకటి ఉంటాయని ఊరిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాల్లో ఇంత పెద్ద విలన్ గ్యాంగ్ ఉన్న సినిమా పుష్ప ఒక్కటే. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొత్త తరహా ఎత్తుగడలను చూపించేందుకు సుకుమార్ ప్రత్యేకంగా రీసెర్చ్ కూడా చేయించారట. సో అభిమానులు చాలా సర్ప్రైజులకు సిద్ధమవ్వాల్సిందే.

This post was last modified on November 14, 2024 11:58 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago