Movie News

రమణ గోగుల….ఎన్నేళ్లకు వినిపించావ్ ఇలా

ఇప్పుడంటే తమన్, అనిరుధ్, డీఎస్పి అంటూ కొత్త తరం సంగీతంలో మునిగి తేలుతున్నాం కానీ ఒకప్పుడు విలక్షణమైన మ్యూజిక్, విభిన్నమైన గొంతుతో యువతను ఊపేసిన రమణ గోగుల చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పదకొండేళ్ల క్రితం 2013లో తేజ 1000 అబద్దాల తర్వాత మళ్ళీ ఆయన కంపోజింగ్ చేయలేదు. ఎంత కనిపించకపోయినా ఫ్యాన్స్ మాత్రం పాటలు విన్నప్పుడల్లా తలుచుకుంటూ ఉంటారు. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన గాయకుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంలో ఒక సాంగ్ ఆయనతో పాడించాడు భీమ్స్.

ఇంత ప్రత్యేకంగా రమణ గురించి చెప్పడానికి కారణాలున్నాయి. వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో 1998లో పరిశ్రమకు వచ్చారు. తొలి ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్. తర్వాత పవన్ కళ్యాణ్ తో సింక్ కుదిరింది. తమ్ముడు, బద్రి, జానీ రూపంలో ఛార్ట్ బస్టర్స్ పడ్డాయి. వెంటనే మహేష్ బాబు నుంచి పిలుపు. యువరాజు అంతగా ఆడకపోయినా ఆడియో జనంలోకి బాగా వెళ్ళింది. వెంకటేష్ లక్ష్మితో పాటు ప్రభాస్ యోగికి పాటలు ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మణిశర్మతో చేయించారు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మినహా మిగిలిన నాలుగైదు సినిమాలు నిరాశ పరిచాక సెలవు తీసుకున్నారు.

తిరిగి ఇంత గ్యాప్ తర్వాత రమణ గోగులని తీసుకురావడం చూస్తే దర్శకుడు అనిల్ రావిపూడి టేస్ట్ ని మెచ్చుకోవచ్చు. తొలి ఆడియో సింగల్ గా దీన్నే త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. టైటిల్ కు తగ్గట్టే సంక్రాంతికే విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ లో మీనాక్షి చౌదరి, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా పూర్తి వినోదాత్మకంగా రావిపూడి రూపొందించాడనే టాక్ ఉంది. ఎఫ్2, ఎఫ్3ల మించి వెంకీ మార్కు ఫన్ పుష్కలంగా ఉంటుందని అంటున్నారు. ధమాకాతో పెద్ద హీరోల లీగ్ లోకి అడుగు పెట్టిన భీమ్స్ సిసిరోలియోకి ఇది పేద టర్నింగ్ పాయింట్. హిట్టు కొడితే మాత్రం ఒక్కసారిగా దశ మారిపోతుంది.

This post was last modified on November 13, 2024 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

3 hours ago

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

9 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

10 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

11 hours ago