Movie News

డిజాస్టర్ల ఎఫెక్ట్ గ‌ట్టిగానే ఉంది

టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ ఒక ద‌శ‌లో ఫిదా, ఎఫ్‌-2 తొలి ప్రేమ లాంటి హిట్ల‌తో మంచి ఊపు మీదే క‌నిపించాడు. కానీ రెండు మూడేళ్లుగా అత‌డికి అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు ఎఫ్‌-2కు కొన‌సాగింపుగా చేసిన ఎఫ్‌-3 అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఇక సోలో హీరోగా అత‌ను న‌టించిన గ‌ని, గాండీవ‌ధారి అర్జున‌, ఆప‌రేష‌న్ వాలెంటైన్ సినిమాలు ఒక‌దాన్ని మించి ఒక‌టి డిజాస్ట‌ర్లు అయ్యాయి. దీంతో త‌న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ మీద ప్ర‌భావం కూడా గ‌ట్టిగానే ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది.

వ‌రుణ్ కొత్త చిత్రం మ‌ట్కా టీజ‌ర్, ట్రైల‌ర్ ప్రామిసింగ్‌గా క‌నిపించినా స‌రే.. దీనికి అనుకున్న స్థాయిలో బ‌జ్ క్రియేట్ కాలేదు. సినిమాకు బిజినెస్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు కూడా ఎదురైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. బిజినెస్ సంగ‌తేమో కానీ.. విడుద‌ల ముంగిట హైప్ లేని విష‌యం అడ్వాన్స్ బుకింగ్స్‌లో స్ప‌ష్టంగా తెలిసిపోతోంది.

మ‌ట్కాకు రెండు రోజుల ముందే బుకింగ్స్ మొద‌లు కాగా.. టికెట్ల అమ్మ‌కాలు మ‌రీ డ‌ల్లుగా సాగుతున్నాయి. హైద‌రాబాద్ లాంటి మేజ‌ర్ సిటీల్లో ఏవో కొన్ని షోల‌కు మిన‌హాయిస్తే ఆక్యుపెన్సీలు పెద్ద‌గా లేవు. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న షోల‌ను వేళ్ల మీద లెక్క‌బెట్ట‌వ‌చ్చు.

ప్రేక్ష‌కులకు దీపావ‌ళి సినిమాలు మంచి కిక్కిచ్చాయి. వాటిని బాగా చూశారు. ఆ సినిమాల‌కు బాగా ఖ‌ర్చు పెట్టేయ‌డం వ‌ల్లో ఏమో.. గ‌త వారం సినిమాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ వారం కంగువ లాంటి భారీ చిత్రం రేసులో ఉంది. దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అంత గొప్ప‌గా లేవు. అంత పెద్ద సినిమాతో పోటీ ప‌డుతుండ‌డం మ‌ట్కాకు స‌మ‌స్య‌గా మారింది. మామూలుగానే వరుణ్ వ‌రుస డిజాస్ట‌ర్లు ఎదుర్కోవ‌డం మైన‌స్ కాగా.. దీపావ‌ళి సినిమాల ఎఫెక్ట్, కంగువ‌తో పోటీ మ‌ట్కా మీద ప్ర‌తికూల‌ ప్ర‌భావం చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐతే సినిమాకు టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా పుంజుకుంటుంద‌నే ఆశాభావంతో మేక‌ర్స్ ఉన్నారు.

This post was last modified on November 12, 2024 11:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

60 minutes ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

2 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

2 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

2 hours ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

3 hours ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

3 hours ago