మాములుగా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఒక వారం రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే బ్లాక్ బస్టర్ గా నిర్ణయించే రోజులివి. అలాంటిది మూడో వారంలో అడుగు పెడుతున్న టైంకే 250 కోట్లు అందుకుంటే దాన్నేమంటారు. శివ కార్తికేయన్ ఈ ఫీట్ సాధించిన పదకొండో ఇండియన్ స్టార్ గా నిలవడం చిన్న విషయం కాదు. అయితే అమరన్ ఇంత ప్రేమను అందుకోవడానికి 5 ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం. మొదటిది సాయిపల్లవి. మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా తనిచ్చిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఫ్యామిలీ సన్నివేశాల్లో తనకు వేరెవరు సాటిరారని నిరూపించింది.
రెండోది మణిరత్నం, గౌతమ్ మీనన్ తరహాలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి చూపించిన టేకింగ్. ఎక్కడా కమర్షియల్ వాసన లేకుండా, అలాని విసుగు తెప్పించకుండా నిజాయితీగా స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు ఎన్ని అవార్డులు తీసుకొస్తుందో ఇప్పుడే ఊహించడం కష్టం. మూడోది జివి ప్రకాష్ కుమార్ సంగీతం. ఇటీవలి కాలం తన స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వలేక కొంత నిరాశ పరుస్తున్న ఇతను అమరన్ కు మాత్రం అద్భుతమైన స్కోర్ ఇచ్చాడు. కథలో ఆత్మను గొప్పగా ఆవిష్కరించాడు. నాలుగో కారణం నిర్మాత కమల్ హాసన్ కమిట్ మెంట్. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా కంటెంట్ నమ్మి ఖర్చు పెట్టారు.
చివరిది మరియు అసలైన కారణం శివ కార్తికేయన్. ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా, ఇలాంటి బయోపిక్కులు గతంలో మేజర్ లాంటివి వచ్చాయని భయపడకుండా ఒప్పుకోవడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సెటిల్డ్ గా చేసిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒకప్పుడు తుపాకీ టికెట్ దొరికితేనే గర్వంగా ట్వీట్ చేసుకున్న ఇతను ఇప్పుడు తన సినిమాకు టికెట్లే దొరకని పరిస్థితుల్లో ఫ్యాన్స్ పెడుతున్న ట్వీట్లు చూసుకుని మురిసిపోతున్నాడు. ఏది ఏమైనా భాషతో సంబంధం లేకుండా అమరన్ ఇంత ప్రేమను దక్కించుకోవడం ఒక కేస్ స్టడీ లాంటిది. మరిన్ని రియల్ హీరో కథలకు స్ఫూర్తినిచ్చేది.
This post was last modified on November 13, 2024 9:43 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…