ఓటీటీల విప్లవం మొదలయ్యాక సినిమాలకు థియేటర్లలో లాంగ్ రన్ తగ్గిపోయిన మాట వాస్తవం. కరోనా టైంలో థియేటర్లు మూతపడడం.. నేరుగా పలు చిత్రాలు ఓటీటీల్లో రిలీజ్ కావడంతో వాటికి బాగా అలవాటు పడ్డారు. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నా సరే.. మునుపటి స్థాయిలో ఆక్యుపెన్సీలు, లాంగ్ రన్ లేక థియేటర్లకు ఇబ్బందులు తప్పలేదు.
చాలా సినిమాలు థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తగ్గిపోయింది. థియేట్రిక్ రిలీజ్, డిజిటల్ రిలీజ్‌కు మధ్య గ్యాప్ పెంచకపోతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే చర్చ తరచుగా జరుగుతూ ఉంటుంది కానీ.. దీన్ని అమలు చేయడం కష్టంగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా థియేటర్లలో లాంగ్ రన్‌తో ముందే కుదిరిన డిజిటల్ డీల్‌ను రివైజ్ చేయాల్సిన పరిస్థితి కల్పించింది. ఆ చిత్రమే.. అమరన్.
దీపావళి కానుకగా అక్టోబరు 31న ‘అమరన్’ తమిళ, తెలుగు భాషల్లో రిలీజైంది. రెండో చోట్లా సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కింది. అంతకంతకూ ఆక్యుపెన్సీలు పెరిగాయి. రెండు వారాల తర్వాత కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. రెండో వీకెండ్లో ఈ చిత్రానికి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్స్ పడడం విశేషం. ఈ వారం ‘కంగువ’ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజవుతున్నప్పటికీ.. ‘అమరన్’కు పెద్ద ఎత్తున స్క్రీన్లు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ.. ఈ చిత్రం తమిళనాడులో మాత్రం ఇంకో మూడు వారాల పాటు బాగా ఆడుతుందనే అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో 28 రోజులకే నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వారం వాయిదా వేస్తున్నారట. ఈ మేరకు నిర్మాతలు నెట్ ఫ్లిక్స్‌తో ఒప్పందాన్ని రివైజ్ చేశారట. ఇలా లాంగ్ థియేట్రికల్ రన్ కారణంగా ఓ సినిమా డిజిటల్ రిలీజ్‌ను వాయిదా వేయడం అరుదుగా జరిగే విషయం. దీన్ని బట్టే ‘అమరన్’ ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.250 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం.
This post was last modified on November 12, 2024 6:27 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…