దర్శకుడు మారుతి ఇప్పటిదాకా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే తీశాడు. అలాంటి దర్శకుడితో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమా ఓకే చేయడం అప్పట్లో పెద్ద షాక్. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ‘రాజా సాబ్’ మీద అంచనాలే వేరుగా ఉన్నాయి. ప్రభాస్ భారీ సినిమాల మధ్య ఆటవిడుపుగా ఈ సినిమాను చిన్న స్థాయిలో చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ‘రాజా సాబ్’ కూడా మిగతా ప్రాజెక్టుల మాదిరే పెద్ద చిత్రంగా మారిపోయింది.
ఈ చిత్ర నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ మాటల్ని బట్టి చూస్తే దీని రేంజే వేరని.. ఒక మాగ్నమ్ ఓపస్‌లాగే దీన్ని తీస్తున్నారని అర్థమవుతోంది. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రాజా సాబ్’ స్కేల్ గురించి మాట్లాడి అభిమానుల్లో ఈ సినిమా పట్ల ఎగ్జైట్మెంట్‌ను పెంచారు.
“రాజా సాబ్ గురించి నేను పరిమితంగానే చెప్పగలను. ఎందుకంటే దానికో ప్రత్యేకమైన మార్కెటింగ్ ప్లాన్ ఉంది. కాబట్టి ఇప్పుడు వివరంగా మాట్లాడలేను. కానీ ఈ సినిమా స్థాయి వేరు. ఈ సినిమా రెండేళ్ల ముందు మొదలైంది. ‘కల్కి’ తర్వాతే పెద్ద షెడ్యూల్ చేశాం. కథ పరంగా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటుంది. వేరే స్కేల్ మూవీ ఇది. స్పాన్ చాలా పెద్దది. సెట్స్, వీఎఫెక్స్ అన్నీ కూడా భారీగా ఉంటాయి. వీటన్నింటితో పాటు ఇదొక కామెడీ ఎంటర్టైనర్.
ప్రభాస్ గారిని ఒక డార్లింగ్ లాగా చూస్తారు. అలాగే లార్జర్ దన్ లైఫ్ స్టైల్లోనూ ఉంటుంది తన పాత్ర. ప్రభాస్‌ను చాలా కొత్తగా చూస్తారు. ఇంతవరకు ప్రపంచ సినిమాలో తీయనంత లెవెల్లో ఈ చిత్రంలో హార్రర్ ఉంటుంది. ఇది చిన్న సినిమా కాదు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించిన దాని కంటే భారీ సెట్ వేశాం. ప్రభాస్ లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది” అని విశ్వ ప్రసాద్ తెలిపారు.
మరోవైపు తన ప్రొడక్షన్లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఫెయిల్యూర్ గురించి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఆ సినిమా షూటింగ్ త్వరత్వరగా చేసేయడంతో కొన్ని పొరపాట్లు జరిగాయని.. హిందీ పాటల కాన్సెప్ట్ తమకు నచ్చినప్పటికీ ఇప్పటి జనరేషన్‌కు అది కనెక్ట్ కాలేదని వివ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు.
This post was last modified on November 11, 2024 2:34 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…