తమిళంలోనే కాక అన్ని భాషల్లో భారీ అభిమానులున్న కమల్ హాసన్ ఇకపై తనకు ఉలగనాయగన్ (లోకనాయకుడు) లాంటి ఉపమానాలు, బిరుదులు వాడొద్దని అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేవలం తన పూర్తి పేరు లేదా కమల్ లేదా కెహెచ్ అని వ్యవహరించాలని అందులో పేర్కొన్నారు. నిజానికి ఇది మంచి పరిణామమే. విలక్షణ నటుడిగా బాల్యం నుంచి వార్ధక్యం దాకా ఐదు దశబ్దాల అనుభవం ఉన్న ఈ వర్సటైల్ యాక్టర్ చేయని పాత్ర, ప్రయత్నించని ప్రయోగం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఫ్యాన్స్ ప్రేమతో లోక నాయకుడని పిలుస్తారు. ఇది దశావతారం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది.
అయితే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏమైనా ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిసిందనే కామెంట్స్ వస్తున్నాయి. కోలీవుడ్ లో అందరికి ట్యాగులున్నాయి. సూపర్ స్టార్, తల, తలపతి, రైజింగ్ స్టార్, మక్కళ్ సెల్వన్ ఇలా ఒక్కో హీరోకి ఒక్కో బిరుదు ఉంది. వారి వారి స్థాయికి తగ్గట్టు అభిమాన సంఘాలు ఉన్నాయి. కొందరు రాజకీయ పార్టీలు కూడా పెట్టారు. ఒక్క అజిత్ మాత్రమే ఫ్యాన్ అసోసియేషన్లను తీవ్రంగా వ్యతిరేకించి వాటితో నాకెలాంటి సంబంధం లేదని చాలా సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పారు. మిగిలిన వాళ్లంతా ఈ దిశగా అడుగులు వేయలేదు.
సరే లేట్ అయినా కమల్ చూపించిన దారి మంచిదే. సినిమా కంటే మనం ఎవ్వరం పెద్ద కాదనే సందేశాన్ని దీని ద్వారా వినిపించారు. అయితే అందరూ ఇది ఫాలో కావాలన్న రూల్ లేదు కానీ ఆలోచిస్తే తప్పనలేంగా. కమల్ దశ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. విక్రమ్ రికార్డులు బద్దలు కొడితే తన స్వంత బ్యానర్ పై నిర్మించిన అమరన్ అంచనాలు మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇండియన్ 2 పోయినా థగ్ లైఫ్ మీద భారీ క్రేజ్ నెలకొంది. ఏడు పదుల వయసులో ఇంకా వేగం తగ్గించని కమల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ముమ్మాటికీ లోక నాయకుడే. కాకపోతే ఫార్మల్ గా అలా పిలవకూడదు అంతే.
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…