Movie News

ఎక్స్‌క్లూజివ్: పుష్ప‌-2 ట్రైల‌ర్ బ్లాస్ట్ ఆ రోజే

ఇప్పుడు ఇండ‌యా మొత్తం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న సినిమా ఏది అంటే.. మ‌రో ఆలోచ‌న‌ లేకుండా పుష్ప‌-2 అని చెప్పేయొచ్చు. మూడేళ్ల‌ కింద‌ట వ‌చ్చిన పుష్ప‌-1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన నేప‌థ్యంతో దీని సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు.

విడుద‌లకు నెల రోజుల ముందే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో పుష్ప‌-2 ఆన్ లైన్లో ట్రెండ్ అవుతూ వ‌స్తోంది. ఐతే ఆ కార‌ణాలు నెగెటివ్ కావ‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం. కానీ త్వ‌ర‌లో పుష్ప‌-2 పాజిటివ్ కార‌ణంతో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కాబోతోంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైల‌ర్ రాబోతోంది. ట్రైల‌ర్ రెడీ అవుతున్న విష‌యాన్ని ఇటీవ‌లే పుష్ప‌-2 మేక‌ర్స్ ట్విట్ట‌ర్లో ఒక పోస్టు ద్వారా వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే అప్‌డేట్ ఇస్తామ‌న్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం పుష్ప‌-2 ట్రైల‌ర్ లాంచ్‌కు ముహూర్తం కుదిరింది.

విడుద‌ల‌కు స‌రిగ్గా రెండు వారాల క్రితం, అంటే న‌వంబ‌రు 20న పుష్ప‌-2 ట్రైల‌ర్ లాంచ్ కాబోతోంది. సుకుమార్ ఇంకా చ‌త్రీక‌ర‌ణ‌లో ఫుల్ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ట్రైల‌ర్ మాత్రం రెడీ చేసేశారు. కొన్ని రోజుల పాటు ఎడిటింగ్ రూంలో కూర్చుని బెస్ట్ షాట్స్, డైలాగ్స్‌తో సుకుమార్ ట్రైల‌ర్‌ను స్ట్రైకింగ్‌గా తీర్చిదిద్దిన‌ట్లు స‌మాచారం. ఆల్రెడీ ట్రైల‌ర్ లాక్ అయిపోవ‌డంతో వ‌చ్చే రెండు మూడు రోజుల్లో ట్రైల‌ర్ డేట్ అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌.

ఇండియాలోని వేర్వేరు న‌గ‌రాల్లో ఒకేసారి టీజ‌ర్ లాంచ్ చేసేలా ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేయ‌బోతున్నార‌ని.. ట్రైల‌ర్‌ను అదే స‌మ‌యంలో థియేట‌ర్ల‌లో కూడా ప్ర‌ద‌ర్శిస్తార‌ని స‌మాచారం. ట్రైల‌ర్ లాంచ్ కంటే ముందే షూట్ అంతా పూర్తి చేయాల‌ని ముందు అనుకున్నారు కానీ.. అది సాధ్య‌ప‌డేలా లేదు. అప్ప‌టికి మిగిలిన రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. కొంత టాకీ పార్ట్ మిగ‌లొచ్చ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొన్ని రోజులుగా బ‌న్నీ-శ్రీలీల మీద ఐటెం సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు.

This post was last modified on November 11, 2024 10:03 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

4 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

5 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

6 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

8 hours ago