Movie News

తమన్ నోట పుష్ప-2 మాట

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ గురించే చర్చ. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. ఎవ్వరూ ఊహించని విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతల నుంచి దేవిశ్రీని తప్పించి ఆ పనిని వేరే సంగీత దర్శకులకు అప్పగిస్తున్నట్లుగా సమాచారం బయటికి రావడంతో అందరూ షాకైపోయారు. ఐతే ఇదంతా అనధికారిక సమాచారమే తప్ప.. టీం నుంచి ఎవ్వరూ దీని గురించి మాట్లాడింది లేదు.

ఈ వార్తలను ఖండించడం లేదంటే మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనని భావించాలి. ఐతే దేవి స్థానంలో బీజీఎం బాధ్యతలు ఎవరు తీసుకున్నారనే విషయంలో స్పష్టత కొరవడింది. కొందరేమో తమన్‌కు ఆ పని అప్పగించారని అంటుంటే.. ఇంకొందరేమో తనతో పాటు అజనీష్ లోక్‌నాథ్, సామ్ సీఎస్‌ కూడా రేసులో ఉన్నారని.. ఎవరికి వాళ్లు వేర్వేరుగా పని చేస్తున్నారని, ఎవరి ఔట్ పుట్ బాగుంటే వాళ్లది తీసుకుంటారని కూడా ఓ ప్రచారం నడుస్తోంది.

ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. తమన్ మాత్రం ‘పుష్ప-2’ కోసం పని చేస్తున్న మాట నిజమే అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తమనే కన్ఫమ్ చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన గాయకుడు కార్తీక్‌ మ్యూజికల్ కన్సర్ట్‌లో తమన్ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా తమన్ ‘పుష్ప-2’ గురించి రెండు ముక్కలు మాట్లాడాడు. ‘‘We have pushpa-2. Waiting‘‘ అనేసి వేరే టాపిక్‌లోకి వెళ్లిపోయాడు తమన్. అతను పుష్ప-2 గురించి ప్రస్తావించగానే ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమన్ స్వయంగా పుష్ప-2కు పని చేస్తున్నట్లు వెల్లడించడంతో దేవిశ్రీని బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతల నుంచి తప్పించారనే భావించవచ్చు.

ఐతే తమన్ విషయంలో దేవిశ్రీ అభిమానులు మాత్రం చాాలా ఆగ్రహంతోనే ఉన్నారు. ఒక సినిమాకు వేర్వేరు సంగీత దర్శకులు పాటలు ఇవ్వడం, బ్యాగ్రౌండ్ స్కోర్ మరొకరితో చేయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు తమన్. పెళ్లి ఒకరితో చేసి శోభనం ఇంకొకరితో చేయడంతో దీన్ని పోల్చిన తమన్.. ఇప్పుడు దేవి సంగీతం అందిస్తున్న సినిమాకు నేపథ్య సంగీతం అడిగితే ఎలా చేస్తున్నాడని అతణ్ని ప్రశ్నిస్తున్నారు.

This post was last modified on November 10, 2024 5:46 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

2 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

4 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

4 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

5 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

6 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

7 hours ago