మంచి క్రేజున్న సెద్ద సినిమాలు పోటీలో ఉన్నా సరే.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు పోటీకి సై అనడం.. కానీ తర్వాత వాస్తవం బోధపడి వెనక్కి తగ్గడం మామూలే. డిసెంబరు తొలి వారంలో పుష్ప: ది రూల్‌కు పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి చూసిన చవ్వా సినిమా తాజాగా రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో ఇలాగే వచ్చే వారం బాక్సాఫీస్ పోటీకి సై అన్న ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా కూడా ఇదే బాటలో సాగింది. సూర్య సినిమా కంగువ ఈ నెల 14న భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుండగా.. దీంతో పాటు వరుణ్ తేజ్ మూవీ మట్కా సైతం రాబోతోంది. వీటితో మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా సినిమా ఏం పోటీ పడగలదో అన్న సందేహాలు కలిగాయి. కానీ నవంబరు 14కే రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుని ఆ దిశగా ప్రమోషన్లు చేసుకుంటూ సాగింది చిత్ర బృందం. దీంతో ఏంటి అశోక్ ధైర్యం అనుకున్నారంతా. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి జాగ్రత్తపడ్డాడు.
నవంబరు 14న కాకుండా వారం ఆలస్యంగా 22న ‘దేవకీ నందన వాసుదేవ’ను విడుదల చేయడానికి చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ వదిలింది. నవంబరు 22న పోటీ ఉంది కానీ.. ఆ వీకెండ్లో ఉన్నవి మరీ పెద్ద సినిమాలు కావు. విశ్వక్సేన్ మూవీ మెకానిక్ రాకీతో పాటు సత్యదేవ్ సినిమా జీబ్రా ఆ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాన్ని ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంద్యాల రూపొందించాడు. ఈ సినిమాకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. అందుకే టీం సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉంది. అశోక్ గల్లా సరసన మానస వారణాసి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా రచన అందించారు.
హీరో మూవీతో కథానాయకుడిగా పరిచయం అయిన అశోక్‌కు తొలి చిత్రం విజయాన్నందించలేదు. దీంతో బాగా గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడం అతడి కెరీర్‌కు చాలా అవసరం.
This post was last modified on November 11, 2024 10:45 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…