గత ఏడాది యానిమల్ తర్వాత రష్మిక మందన్న మళ్ళీ తెరమీద కనిపించలేదు. అలాని గ్యాప్ తీసుకోలేదు కానీ షూటింగుల్లో జరిగిన ఆలస్యం వల్ల రిలీజులు లేట్ అయ్యాయి తప్పింది తను ఖాళీగా లేదు.
అభిమానుల ఆకలిని ఒకేసారి తీర్చాలన్న పట్టుదలతో అన్నట్టుగా కేవలం పది నెలల గ్యాప్ లో ఏకంగా అరడజను సినిమాల్లో శ్రీవల్లి దర్శనం ఇవ్వబోతోంది. మొదటగా ఇందులో బోణీ చేసేది ‘పుష్ప 2 ది రూల్’ అన్న సంగతి మళ్ళీ చెప్పనక్కర్లేదు. మొదటి భాగం కన్నా ఎక్కువగా దర్శకుడు సుకుమార్ తన పాత్రను తీర్చిదిద్దినట్టు ఇప్పటికే టాక్ ఉంది. క్యారెక్టరైజేషన్ ఊహించని విధంగా ఉంటుందట.
పాతిక రోజులు దాటడం ఆలస్యం బాలీవుడ్ ‘చావా’ వచ్చేస్తుంది. మరాఠా వీరుడు శంభాజీ కథ ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక చాలా పవర్ ఫుల్ పాత్రను దక్కించుకుంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉంది. విడుదల తేదీ ఇంకా నిర్ధారించలేదు కానీ వేసవిలోనే తేవాలని ప్లాన్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ జోడిగా నటించిన ‘సికందర్’లో మొదటిసారి కండలవీరుడితో ఆడి పాడుతోంది. ఈద్ సందర్భంగా థియేటర్లకు తీసుకొస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుందో మనకు పరిచయమే.
నాగార్జున ధనుష్ కాంబోలో రూపొందుతున్న ‘కుబేర’లో శేఖర్ కమ్ముల రష్మికను ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. వచ్చే వారం రిలీజ్ చేయబోయే టీజర్ లో విడుదల తేదీ గురించి క్లారిటీ రావొచ్చు. స్త్రీ 2 సృష్టికర్తల మరో హారర్ డ్రామా ‘తమా’లో రష్మిక మందన్న పెద్ద ప్రాధాన్యం దక్కించుకుంది.
ఇవన్నీ ఎలా చూసుకున్నా 2025 అక్టోబర్ లోపు వచ్చేస్తాయి. ఇంకో సినిమా ‘రైన్ బో’ గురించి అప్డేట్స్ ఆగిపోయాయి కాబట్టి అదొక్కటే క్లారిటీ రావాల్సి ఉంది. రాబోయే ఏడాదిలో ఏ హీరోయిన్ చేయనన్ని పెద్ద సినిమాలు రష్మిక మందన్న ఖాతాలో ఉన్నాయి. వాటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో.
This post was last modified on November 10, 2024 5:48 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…