భారతీయుడు 2 రూపంలో అవమానం, ట్రోలింగ్ చవిచూడాల్సి వచ్చిన దర్శకుడు శంకర్ కు గేమ్ ఛేంజర్ వల్ల క్రమంగా తగ్గుతోంది. నిర్మాణంలో విపరీతమైన ఆలస్యం జరిగినప్పటికీ విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యాన్స్ దీన్ని సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు.
నిన్న వచ్చిన టీజర్ పట్ల కొంత మిశ్రమ స్పందన కనిపించినా అత్యధిక శాతం వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రాండియర్, విజువల్స్, చిన్న చిన్న డీటెయిల్స్, పెట్టిన ఖర్చు తెరమీద కనిపించడం, మూడు షేడ్స్ లో రామ్ చరణ్ ని చూపించడం లాంటి పాజిటివ్ అంశాలు జనాలకు కనెక్ట్ అయ్యాయి.
నెక్స్ట్ శంకర్ ని నమ్మి ఏ నిర్మాతైనా వందల కోట్లు పెట్టాలంటే గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. దానికోసమే ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. చెన్నై నుంచి బయటికి రాకుండా ఎడిటింగ్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.
డిసెంబర్ మొదటి వారం లోపు తమన్ కు కాపీ ఇస్తే రీ రికార్డింగ్ పనులు మొదలుపెడతాడు. తన నుంచి బెస్ట్ స్కోర్ రాబట్టుకోవాలంటే తగినంత సమయం ఇవ్వాలి. హడావిడి చేసి ఒత్తిడి తెస్తే క్వాలిటీ తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదు. పైగా తమన్ చాలా బిజీ ఉన్నాడు. గురువైన శంకర్ కోసం ఆల్ టైం బీజీఎమ్ ఇవ్వాలని తహతహలాడుతున్నాడు. దానికి సరైన సహకారం ఇవ్వాలి.
ట్రైలర్ వచ్చాక అనుమానాలన్నీ తీరిపోతాయి కానీ శంకర్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకోవడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు. మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టినా సరే రికవరీ విషయంలో దిల్ రాజు ధీమాగా ఉండటానికి కారణం కంటెంట్ మీద నమ్మకమే.
ఫాంటసీ, మాఫియా, విఎఫెక్స్ లేకుండా ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని హ్యాండిల్ చేశారు కనక అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. తమిళ వెర్షన్ ని సైతం పెద్ద స్థాయిలో విడుదల చేసేందుకు చూస్తున్నారు కానీ ఒకవేళ అజిత్ కనక సంక్రాంతి బరిలో ఉంటే పోటీ పరంగా ఇబ్బందులు తప్పవు. చూడాలి మరి.
This post was last modified on November 10, 2024 5:48 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…