స్టార్ హీరోల అభిమానులు పరస్పరం గొడవలు పడటం ఎప్పటి నుంచో ఉన్నదే. కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. ఒకప్పుడు పోస్టర్ల మీద పేడ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆన్ లైన్ వేదికగా ఒకరిమీద మరొకరు బురద జల్లుకుంటున్నారు. ఇదొక్కటే తేడా అయితే సమస్య లేదు. తాతల కాలంలో ఫ్యాన్ వార్స్ ఒక వీధికి లేదా ఊరికి పరిమితమయ్యేవి.
కానీ ఫైవ్ జి కాలంలో నెట్ ఉన్న ప్రతి ఒక్కరి చేతికి చేరిపోతున్నాయి. అమెరికా నుంచి అమలాపురం దాకా ఇదే వరస. పైన హీరోలు సఖ్యతతో స్నేహంతో ఉంటే కింది స్థాయిలో వాళ్ళను ఇష్టపడే వాళ్ళు మాత్రం రాళ్లు విసురుకునే క్రమాన్ని రాను రాను వికృతంగా మారుస్తున్నారు.
విషయం ఏంటంటే 35 రోజుల వ్యవధిలో పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నంద్యాల వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ఎప్పుడైతే మద్దతు కోసం వెళ్ళొచ్చాడో అప్పటి నుంచి మెగాభిమానులు తనను వేరుగా చూస్తున్నారు.
ఇటువైపు బన్నీ ఫ్యాన్స్ స్వంతంగా కష్టపడి ఐకాన్ స్టార్ అయిన తమ హీరోకి ఎవరి మద్దతు అక్కర్లేదని కౌంటర్లు వేస్తున్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇప్పుడిది ట్వీట్ నుంచి ఫ్లెక్సిలు, కటవుట్లు, బ్యానర్ల దాకా పాకిపోయింది. ఇక్కడ చెప్పలేని మాటలతో ఒకరిమీద మరొకరు దారుణమైన పంచులు, కౌంటర్లు వేసుకుంటూ కాలాన్ని వృథా చేస్తున్నారు.
ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మమ్మల్ని ఏదైనా అంటే భవిష్యత్తులో మీ సినిమా వచ్చినప్పుడు చూసుకుంటామని సవాల్ విసురుతూ ఇరువైపులా నష్టపోయే పరిస్థితి తెస్తున్నారు. దేవరకు సైతం ఇలాంటి డ్యామేజ్ జరగబోయింది కానీ కంటెంట్ బలం వల్ల తట్టుకుని నిలబడింది. రేపు పుష్ప 2, గేమ్ ఛేంజర్ బాగుండొచ్చు.
కానీ ఇలా భిన్న ధృవాలుగా ఫ్యాన్స్ ప్రవర్తించడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. ఇక్కడితో ఆగరు. నెక్స్ట్ హరిహర వీరమల్లు లేదా విశ్వంభర టార్గెట్ కావొచ్చు. అయినా హీరోలు స్వయంగా చెప్పినా వినే పరిస్థితిలో కొందరు అభిమానులు లేరు. దాని వల్ల నష్టం ఎవరికో గుర్తించనంత వరకు ఇవి ఆగవు.
This post was last modified on November 10, 2024 5:59 pm
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…