ప్రభాస్ స్థాయి ప్యాన్ ఇండియాని మించి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. నిన్న సాయంత్రం కొరియన్ నటుడు డాన్ లీ తన ఇన్స్ టాలో సలార్ పోస్టర్ ని షేర్ చేసుకుంటూ చిన్న థమ్స్ అప్ సింబల్ పెట్టాడు. అంతే ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది. సలార్ 2లో డాన్ లీ ఉన్నాడని అందుకే ప్రత్యేకంగా షేర్ చేసుకున్నాడని అభిమానులు సంబరంలో మునిగిపోయారు. నిజానికి కొన్ని వారాల క్రితం ఇతను సందీప్ రెడ్డి వంగా తీయబోయే స్పిరిట్ లో కీలక వేషం దక్కించుకున్నాడనే ప్రచారం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి సమర్ధన, ఖండన ఆయా వర్గాల నుంచి రాలేదు.
ఈలోగా సలార్ 2ని డాన్ లీ ప్రస్తావించగానే హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. నిజానికి తను సినిమాలో ఉన్నాడో లేదో తెలియదు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. ప్రభాస్ లుక్ నచ్చి దాన్ని పంచుకున్నాడో లేక ఏదైనా క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో స్పష్టత లేదు. అయినా సరే చిన్న పుల్ల అడవిని కాల్చినట్టు డాన్ లీ ఇన్స్ టా కి వస్తున్న ట్రాఫిక్ ని తట్టుకోలేక కాసేపు ఆ పేజీని బ్లాక్ చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2016లో వచ్చిన ట్రైన్ టు బుసాన్ నుంచి డాన్ లీ పాపులారిటీ బాగా పెరిగింది. అవుట్ లాస్, ఎటర్నల్స్ లాంటి హాలీవుడ్ మూవీస్ పేరు తీసుకొచ్చాయి.
ఇతనికి పలు రంగాల్లో ప్రవేశం ఉంది. ఎంఎంఏ ఫైటర్స్ కి శిక్షణ ఇచ్చిన అనుభవంతో పాటు కొరియన్ సినిమాలకు అతను కంపోజ్ చేసే స్టంట్స్ అబ్బురపరిచేలా ఉంటాయి. మరి ఇప్పుడు సలార్ 2 లేదా స్పిరిట్ లో డాన్ లీ పాత్ర పోషిస్తాడా లేక యాక్షన్ కొరియోగ్రఫీలో భాగం పంచుకుంటాడా అనేది వేచి చూడాలి. మొన్న హోంబాలే ఫిలింస్ మూడు అనౌన్స్ మెంట్లకే ఉక్కిరిబిక్కిరి అయిపోయిన డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడీ డాన్ లీ అప్డేట్ చూసుకుని తెగ మురిసిపోతున్నారు. ఏది ఏమైనా ప్యాన్ వరల్డ్ ని మించి ప్రభాస్ ఇంతింతై అన్న రీతిలో అందనంత ఎత్తుకు ఎదగడం చూస్తే తెలుగువాడిగా ఇంతకన్నా గర్వం ఏముంటుంది.
This post was last modified on November 10, 2024 12:10 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…