ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటిగా మంచి హైప్ తెచ్చుకున్న ‘ఇండియన్-2’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎంత దారుణమైన ఫలితం ఎదురైందో తెలిసిందే. శంకర్ కెరీర్లోనే ఇంత పేలవమైన సినిమా మరొకటి ఉండదు అంటే ఖండించేవాళ్లు ఉండకపోవచ్చు. అనవసరంగా ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ చేసి చేతులు కాల్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియన్-2 డిజాస్టర్ కావడంతో ఇండియన్-3 పరిస్థితి ఏంటా అనే అయోమయం నెలకొంది.
నిజానికి ఈ సీక్వెల్‌ను ఒక సినిమాగానే చేయాలనుకున్నారు. కానీ సినిమా చాలా ఆలస్యమై, బడ్జెట్ అమాంతం పెరగిపోవడంతో రెండు భాగాలుగా చేసి బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావించారు. కానీ ఇందుకోసం కథను సాగదీయడమే ఈ ప్రాజెక్టుకు ప్రతికూలంగా మారింది. ఆల్రెడీ ‘ఇండియన్-3’ షూట్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం పెండింగ్‌లో పెట్టిన టీం.. దాన్ని ఏం చేయబోతోందనే విషయంలో అయోమయం నెలకొంది. ఈ మధ్య ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అదెంత వరకు నిజయో తెలియలేదు.
కట్ చేస్తే ఇప్పుడు కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే.. ‘ఇండియన్-3’ని మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నారట. కమల్ హాసన్ చెప్పిన కొన్ని మార్పులు చేర్పులను అనుసరించి మళ్లీ కొంత షూట్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే షూట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ ముందు నుంచి ‘ఇండియన్-3’ విషయంలో ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
‘ఇండియన్-2’ రిలీజ్ టైంలో కూడా ఇండియన్-3లోని కథే ఈ సినిమా చేయడానికి కారణమని చెప్పారు. దీంతో ‘ఇండియన్-3’నే బాగుంటుందని, ఇండియన్-2 వీక్ అనే చర్చ కూడా జరిగింది. కానీ తర్వాత కమల్ ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ చివరికి చూస్తే ఇండియన్-2 తుస్సుమనిపించింది. ఆ సినిమా చివర్లో ప్రదర్శించిన ఇండియన్-3 మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇండియన్-2 ఫెయిలవడంతో ఆ ప్రభావం ఇండియన్-3 మీద గట్టిగానే పడింది. కానీ కొంత మెరుగులు దిద్దితే ఇండియన్-3 ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని, ఇండియన్-2 ఫెయిల్యూర్‌ను మరిపించేలా మంచి ఫలితాన్ని అందుకుంటుందని కమల్ అభిప్రాయపడడంతో టీం కన్విన్స్ అయి ఒక నెల రోజులు మళ్లీ షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
This post was last modified on November 9, 2024 6:49 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…