రాజమౌళి సినిమా అంటే కనీసం ఐదొందల కోట్ల బడ్జెట్.. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగే స్థాయి ఉంది ఇప్పటిదాకా. ఐతే ఆయన చివరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ లెవెల్లో సంచలనం రేపి జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండరీ హాలీవుడ్ దర్శకుడిని కూడా అబ్బురపరిచడం, జక్కన్న మార్కెట్ మరింత విస్తరించిన నేపథ్యంలో కొత్త చిత్రం రేంజ్ మారిపోనుందని అందరికీ తెలుసు.
ఐతే ట్రేడ్ పండిట్లు అంచనా వేసిన దాని కంటే మహేష్ బాబుతో రాజమౌళి చేయనున్న సినిమా స్థాయి ఎక్కువ అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి తాను విన్న విషయాలను సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విషయాలు వింటే వావ్ అనుకోకుండా ఉండలేం.
మహేష్-రాజమౌళి సినిమా బడ్జెట్ కనీసం అంటే కనీసం రూ.1000 కోట్లు ఉంటుందని తమ్మారెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్లను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా అనేక భారీ లొకేషన్లలో సినిమాను షూట్ చేయబోతున్నారని.. బడ్జెట్ రూ.1200-1300 కోట్లకు కూడా చేరుకునే అవకాశాలున్నాయని తమ్మారెడ్డి తెలిపారు. ఇక ఈ చిత్రానికి బిజినెస్ కనీసం రూ.2000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని.. సినిమా రేంజిని బట్టి అది మూణ్నాలుగు వేల కోట్లకు పెరిగినా పెరగొచ్చని తమ్మారెడ్డి అన్నారు.
తనదైన విజన్‌తో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తీసి భారతీయ సినిమా స్థాయిని రాజమౌళి ఎంతో పెంచేశారని.. ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే చిత్రంతో ఆయన మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచబోతున్నారని.. ఇండియా గర్వించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని తమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఐతే బాహుబలి తర్వాత భారతీయ చిత్రాల బడ్జెట్లు అమాంతం పెరిగిపోవడం ఇబ్బందిగా మారిందని.. రాజమౌళి-మహేష్ సినిమా తర్వాత బడ్జెట్లు ఇంకా పెరిగి సమస్యగా మారుతుందేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on November 9, 2024 6:41 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…