టెక్నాలజీ పెరిగిపోయాక సెట్లో లేదా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు లీకులను అరికట్టడం పెద్ద సవాల్ గా మారిపోతోంది. సెల్ ఫోన్ తేకుండా కట్టడి చేసినా సరే ఏదో ఒక దొంగచాటు రూపంలో ఫోటోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తాజాగా మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన పిక్ ఒకటి అనఫీషియల్ గా బయటికి వచ్చింది. చిత్రీకరణ సమయంలో కెమెరా ప్రివ్యూ స్క్రీన్ నుంచి దొంగతనంగా తీసిన వైనం అందులో కనిపించింది. ఫ్రేమ్ రేట్ తదితర వివరాలు అందులో ఉన్నాయి. దీంతో కన్నప్ప టీమ్ వేగంగా స్పందించింది.
ఎనిమిది సంవత్సరాలు స్క్రిప్ట్ కోసం వెచ్చింది రెండేళ్లుగా నిర్మాణం చేస్తున్న తమ ప్యాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లుక్ ఇలా లీక్ కావడం బాధించిందని, కారకులని ఎవరైనా కనిపెట్టగలిగితే అయిదు లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించింది. పోలీస్ కేసు పెడుతున్నామని ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా విఎఫెక్స్ తో పాటు ఎందరో సాంకేతిక నిపుణుల జీవితాలు ప్రభావితం చెందుతాయని మంచు విష్ణు బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ అసలు మూలం ఎక్కడుందో కనిపెట్టి చోరులను పట్టిస్తే ప్రభాస్, విష్ణులకు అంతకన్నా గిఫ్ట్ ఏముంటుంది.
కన్నప్పలో చాలా కీలకమైన ప్రభాస్ క్యామియో ఈ రూపంలో అనధికారికంగా బయటికి రావడం క్షమించరాని నేరం. ఒక మంచి సందర్భంలో ఫ్యాన్స్ ఎగ్ జైట్మెంట్ పెంచేలా ఇలాంటి పోస్టర్లు, లుక్స్ వదిలితే బాగుంటుంది తప్ప లీకు రూపంలో రావడం మాత్రం ఖండించాల్సిన తప్పు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కన్నప్ప సరైన స్లాట్ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్ లో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి వైపు చూడాల్సి ఉంటుంది. ఇంకొద్ది వారాల్లో దీనికి సంబంధించి మంచు విష్ణు టీమ్ నిర్ణయం తీసుకోబోతోంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లు ఉంటాయి.
This post was last modified on November 9, 2024 2:50 pm
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…