ఒకప్పుడు తెలుగు సినిమా ఏదైనా హిందీలో డబ్బింగ్ కు వెళ్లాలంటే అదో పెద్ద తతంగం. స్ట్రెయిట్ మూవీ చేసినా బలమైన మార్కెట్ ఏర్పడుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎక్కువ రిస్కులు చేయకుండా 90 దశకం ప్రారంభంలోనే కొన్ని హిట్లు కొట్టి వెనక్కు వచ్చారు. ఇదంతా గతం.
ఇప్పుడు బాలీవుడ్ నే తలదన్నేలా ఆల్ టైం రికార్డు బ్లాక్ బస్టర్స్ సౌత్ నుంచి వస్తున్నాయి. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప, కల్కిలను దాటేందుకు నార్త్ మేకర్స్ పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. అయితే టాలీవుడ్ సినిమాలు ఎంత బంగారు గనులో అర్థం కావాలంటే మనీష్ షా మాటలు వినాలి.
గోల్డ్ మైన్స్ ప్రపంచంలోనే పదవ అతి పెద్ద యూట్యూబ్ ఛానల్,. 10 కోట్లకు పైగా చందాదారులతో ఏడాదికి 400 కోట్ల రెవిన్యూ చూపిస్తోంది. ఈయన పట్టిందల్లా బంగారం కావడానికి పునాది వేసింది తెలుగు సినిమాలే. 2004లో రిలీజైన మాస్ ని కేవలం 7 లక్షలకు కొని మేరీ జంగ్ పేరుతో డబ్బింగ్ చేస్తే కోట్ల రూపాయల కనకవర్షం కురిపించింది.
అల్లు అర్జున్ అల్ట్రా డిజాస్టర్ వరుడు కేవలం 10 లక్షలకు కొనుగోలు చేస్తే ఇప్పుడివి 20 కోట్లకు పైగానే విలువ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఇక్కడ దారుణంగా పోయినా హిందీలో ఆదరణ దక్కించుకుంది. సూర్య డబ్బింగ్ మూవీ అంజాన్ (సికందర్) సైతం డబ్బులు తెచ్చిన సినిమానే.
నార్త్ ప్రేక్షకులు కోరుకునే మాస్ కమర్షియల్ సినిమాలు ఇవ్వడంలో బాలీవుడ్ వెనుకబడటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మనీష్ వివరించారు. అనువదించేటప్పుడు చేయించే ఎడిటింగ్ లు చాలా ప్లస్ అవుతాయని అంజాన్, వరుడు నిరూపించాయట.
ముంబైలో ఉండే దర్శకులు రామ్ కామ్ పేరిట కేవలం సిటీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుంటారని కానీ అసలైన బాక్సాఫీస్ సత్తా మాస్ లో ఉంటుందని అన్నారు. అల వైకుంఠపురములో, జెర్సి డబ్బింగులు చూసేయడం వల్లే రీమేకులు కనీస స్థాయిలో ఆడలేదనే లాజిక్ చెప్పుకొచ్చారు. చూశారుగా తెలుగు సినిమా ఆయనకు బంగారు బాతులా ఎలా మారాయో.
This post was last modified on %s = human-readable time difference 3:38 pm
డిజాస్టర్ స్ట్రీక్కు తెరదించుతూ ‘క’ మూవీతో మంచి హిట్టే కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. మీటర్, రూల్స్ రంజన్…
టాలీవుడ్లో మొదటిసారి ఒక కంప్లీట్ మనీ క్రైమ్ ఆధారంగా రూపొందిన లక్కీ భాస్కర్ ఇంకా వంద కోట్ల మైలురాయి అందుకోలేదు.…
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల…
మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు.…
ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి…
ఇటీవలే జితేందర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకేష్ మాట్లాడుతూ సెలబ్రిటీల కోసం ఎంత ప్రయత్నించినా కుదరలేదని,…