Movie News

యూత్ హీరోలకు దిల్ రాజు హితబోధ

ఇటీవలే జితేందర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకేష్ మాట్లాడుతూ సెలబ్రిటీల కోసం ఎంత ప్రయత్నించినా కుదరలేదని, వాళ్ళు వస్తేనే మీడియా అటెన్షన్ చిన్న సినిమాల వైపు ఉంటుందని, దీని మీద దృష్టి పెట్టడం కన్నా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ ఎగ్జి బిషన్ లాంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టమని చెప్పిన వీడియో ఇండస్ట్రీలోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ బాగానే వెళ్ళింది. ట్విట్టర్ లో పలువురు షేర్ చేసుకోవడంతో ఈ టాపిక్ మీద చర్చలు జరిగాయి. ఇదే తరహాలో కిరణ్ అబ్బవరం ‘క’ వేడుకలో ట్రోలింగ్ మీద తన ఆవేదనను నాగచైతన్య ముందు వ్యక్తపరచడం చూశాం.

ఇవాళ దిల్ రాజు క విజయోత్సవ వేడుకలో వీటికి స్పందించారు. ముందుగా రాకేష్ మాటలను ఉటంకిస్తూ ఇక్కడ ఎవరి కోసం ఎవరూ రారని, కంటెంట్ తో రుజువు చేసుకుని సక్సెస్ కొట్టాకే మాట్లాడాలి తప్పించి, రాలేదని కంప్లయింట్ చేయడం వల్ల లాభం లేదని హితవు పలికారు. ట్రోలింగ్ గురించి కిరణ్ అన్న మాటలు చూశానని, ఒకప్పుడు యాభై ఏళ్ళ క్రితం ఒక ఊరికే పరిమితమైన పుకార్లు వెక్కరింపులు ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రపంచమంతా విస్తరించాయి తప్ప పెద్దగా మార్పేమి లేదని అన్నారు. ఇకపై అలా బాధపడుతూ మాట్లాడకుండా ‘క’ లాగా బ్లాక్ బస్టర్స్ కొట్టి నిరూపించుకోవాలని కిరణ్ కు సలహా ఇచ్చారు.

ఇవి చెప్పడానికే ‘క’ సక్సెస్ మీట్ కు వచ్చానని దిల్ రాజు చెప్పడం కొసమెరుపు. నిజానికి ఇలాంటి చొరవ తీసుకోవడం అవసరం. చిన్న సినిమాలు హైప్ లేక ఓపెనింగ్స్ కరువై బాధ పడుతున్న మాట వాస్తవమే కానీ అంతకన్నా ముందు కథా కథనాల మీద ఎక్కువ దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీస్తున్నామా లేదా చూసుకోవాలి. వాటిని కరెక్ట్ గా బ్యాలన్స్ చేసుకోగలిగితే బడ్జెట్, క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సూపర్ హిట్ చేసి పెడతారు. నిన్నటిదాకా సోషల్ మీడియాలో టార్గెట్ అయిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఉత్సాహంగా కనిపించడానికి కారణం క విజయమేగా.

This post was last modified on November 8, 2024 3:39 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

1 hour ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

7 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago