కంగువతో వరుణ్ తేజ్ మట్కా క్లాష్ అవుతుంటేనే అవసరమా అంటూ మెగా ఫ్యాన్స్ లోనే సవాలక్ష సందేహాలున్నాయి. కానీ టీమ్ చాలా నమ్మకంగా మెగా ప్రిన్స్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెబుతోంది. సరే ఇదంటే అంతో ఇంతో ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో కాబట్టి ఏమో అనుకోవచ్చు. కానీ అశోక్ గల్లా ఇంకా ప్రేక్షకుల్లో సరిగా రిజిస్టర్ కాలేదు. డెబ్యూ మూవీ హీరో సోసోగా ఆడింది. చాలా మంది మర్చిపోయారు. ఇప్పుడు రెండో సినిమా దేవకీనందన వాసుదేవ. నవంబర్ 14 కంగువ, మట్కాతో పాటుగా థియేటర్లలో అడుగు పెడుతోంది. ప్రమోషన్లు కూడా క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు.
కథ ఇచ్చింది ప్రశాంత్ వర్మ. సో స్టోరీ పరంగా అనుమానం అక్కర్లేదు. దర్శకత్వం వహించింది అర్జున్ జంధ్యాల. ఈయన బోయపాటి శీను శిష్యుడు. ఇంతకు ముందు కార్తికేయతో గుణ 369 చేశాడు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా నా పేరు శివ తరహా ట్రీట్ మెంట్ వల్ల రొటీన్ అనిపించి జనం నో అనేశారు. ఇప్పుడు దేవకీనందన వాసుదేవతో మరోసారి తన టాలెంట్ చూపించుకునే పనిలో ఉన్నాడు. ఫాంటసీ ఎలిమెంట్ తో పాటు కుటుంబం మొత్తం చూసే అంశాలు, మాస్ మెచ్చుకునే విషయాలు బోలెడు ఉంటాయని నటీనటులు ఊరిస్తున్నారు కానీ అసలు వాసుదేవ ధైర్యం కంటెంటా లేక మరొకటా అంతుచిక్కడం లేదు.
కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు కొన్ని సెకండ్ల పాటు చిన్న క్యామియో చేశాడనే ప్రచారం జరిగింది దీని గురించే. ఇది నిజం కాదని అశోక్ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఇది బజ్ కోసమే చేశారనే కామెంట్లున్నాయి కానీ ఒకరకంగా ఈ పబ్లిసిటీ బాగానే పని చేసి ఈ సినిమా ఒకటుందని తెలిసేలా చేసింది. ప్రశాంత్ వర్మ బ్రాండ్ ని బాగా వాడుకుంటున్న టీమ్ ఇంత ధీమాగా కంగువతో తలపడటం చూస్తుంటే మ్యాటరేదో బలంగానే ఉన్నట్టుండి. ఒకవేళ మేనల్లుడి కోసం మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొస్తే హైప్ ఇంకా పెరుగుతుంది. కానీ ఛాన్స్ తక్కువే. మానస వారణాసి హీరోయిన్ గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
This post was last modified on November 8, 2024 12:18 pm
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…