ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనేది అన్ని రంగాల్లోనూ ఉండదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ లక్షణం అలవర్చుకున్న వాళ్లే గొప్ప స్థాయికి చేరుకుంటారు. దానికి అత్యుత్తమ ఉదాహరణ రాజమౌళి. హైదరాబాద్ లో జరిగిన కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన జక్కన్న సూర్య అభిమానులతో పాటు సగటు మూవీ లవర్స్ హృదయాలను కొల్లగొట్టేశారు.
ప్యాన్ ఇండియా సినిమాలు తీయడంలో తనకు సూర్యనే స్ఫూర్తని, గజిని టైంలో తెలుగు రాష్ట్రానికి వచ్చి తన చిత్రాన్నిఆడియన్స్ కి చేరువ చేసేందుకు అతను పడిన తాపత్రయం ఎంతగానో ఆకట్టుకుందని, అందరికి చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు.
బాహుబలికి ఇన్స్ పిరేషన్ సూర్య అని చెప్పేసరికి అప్పటిదాకా ఆనందంగా ఇదంతా వింటున్న కంగువ కుర్చీ నుంచి లేచి స్టేజిపైకి వెళ్ళిపోయి రాజమౌళికి హగ్ ఇచ్చాడు. ఇప్పుడీ వీడియో చూసిన ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి కోలీవుడ్ మూవీగా కంగువ నిలుస్తుందనే అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో జక్కన్న ఇచ్చిన బూస్ట్ ఖచ్చితంగా పని చేయనుంది. రాజమౌళి ఇంత ఓపెన్ గా తనకు స్ఫూర్తినిచ్చిన హీరో గురించి చెప్పడం అరుదు. దానికి కంగువ వేదిక కావడం ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసింది. ఆ వీడియోనే తెగ షేర్ చేసుకుంటున్నారు.
ఇంతే కాదు గతంలో సూర్య ఒక ఇంటర్వ్యూలో తనతో సినిమా చేయడం మిస్సయ్యానని అన్నాడని, నిజానికి అది చేజార్చుకుంది తానని రాజమౌళి చెప్పడం మరో విశేషం. మొత్తానికి సూర్య పట్ల తనకున్న అభిమానాన్ని, గజిని పట్ల ఇష్టాన్ని రాజమౌళి ఈ రూపంలో వ్యక్తపరిచాడు. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేలకు పైగా స్క్రీన్లలో షోలు వేసుకోబోతోంది. నెంబర్ ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. గతంలో మీడియాతో హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించినా అందరికి మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో తాజాగా మరో ఈవెంట్ చేయడం కంగువకు పెద్ద ప్లస్ కానుంది.
This post was last modified on November 7, 2024 10:10 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…