ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సినిమాకైనా ప్రమోషన్లు చాలా కీలకం. పెద్ద సినిమాలు రిలీజైనపుడు హీరో హీరోయిన్లతో పాటు దర్శకులు కూడా ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటారు. అలాగే ప్రెస్ మీట్లకు హాజరవుతారు. మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తారు ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.
కానీ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం రిలీజ్ ముంగిట మీడియాకు దొరకడం తక్కువ. ఎందుకంటే చివరి నిమిషం వరకు ఆయన తన సినిమాలను చెక్కుతూనే ఉంటారు. రిలీజ్‌కు ఒకట్రెండు రోజుల ముందు వరకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయన తీరిక లేకుండా ఉంటాడు.
గతంలో అయినా కొన్ని చిత్రాలకు ప్రమోషన్లలో పాల్గొన్నాడు కానీ.. పుష్ప: ది రైజ్ విడుదల సమయంలో మాత్రం ఆయన మీడియాకు అస్సలు దొరకలేదు. రిలీజ్ ముందు రోజు రాత్రి ఒక చిన్న ప్రెస్ మీట్‌కు మాత్రమే హాజరయ్యాడు.
అంతకు కొన్ని గంటల ముందు కూడా ముంబయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లకు ఎందుకు రాలేదని అడిగితే.. వాటికి దూరంగా ఉండి మూణ్నాలుగు రోజుల పాటు నిద్ర లేకుండా పని చేస్తేనే తర్వాతి రోజు సినిమా రిలీజవుతోందని వ్యాఖ్యానించారాయన.
ఐతే పుష్ప-1కు అంత హడావుడి అయిన నేపథ్యంలో పుష్ప-2 విషయంలో జాగ్రత్త పడతారని.. ముందే ఫస్ట్ కాపీ రెడీ చేసి ప్రశాంతంగా ప్రమోషన్లు చేసుకుంటారని భావించారు. కానీ ఈసారి కూడా కథ ఏమీ మారట్లేదని సమాచారం. పుష్ప-2 విడుదలకు ఇంకో నెల రోజుల సమయం కూడా లేదు. ఇంకా 20 రోజులకు పైగా చిత్రీకరణ మిగిలే ఉందని సమాచారం. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండనే ఉన్నాయి. రెండు మూడు యూనిట్లను ఏర్పాటు చేసి రేయింబవళ్లు పని చేస్తున్నా డెడ్ లైన్ అందుకోవడం కష్టంగా ఉంది.
నిర్మాతలు చెప్పినట్లు నవంబరు 20కల్లా ఫస్ట్ కాపీ ఇవ్వడం అసాధ్యంగా కనిపిస్తోంది. నెలాఖరు వరకు షూటింగే అయ్యేలా ఉంది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పటికీ.. ఫైనల్ డే షూట్ తర్వాత మూణ్నాలుగు రోజులైనా ఎడిటింగ్, డబ్బింగ్, మిక్సింగ్ పనులు ఉంటాయి. కాబట్టి సుకుమార్ రిలీజ్ ముంగిట మీడియాకు దొరికే అవకాశమే లేదని తెలుస్తోంది. అసలీ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్లు చేయాలనుకున్నారు కానీ.. ఇప్పుడు అనుకున్న ప్రకారం అవి జరిగేలా లేవు. ఈవెంట్లు చేసినా సుకుమార్ అయితే వాటిలో పాల్గొనడు. కుదిరితే పుష్ప-1 తరహాలోనే రిలీజ్ ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశముంది.
This post was last modified on November 7, 2024 9:57 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…