టాలీవుడ్లో కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకుని ఔట్ పుట్ ఇచ్చే టెక్నీషియన్లతోనే పని చేస్తుంటారు. రాజమౌళి, సుకుమార్ ఈ కోవకే చెందుతారు. వీళ్లిద్దరూ ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతోనే ఎక్కువ పని చేశారు. కెరీర్లో ఒక్కసారి కూడా ఈ ఇద్దరూ సంగీత దర్శకులను మార్చలేదు.
రాజమౌళి సినిమా అంటే కీరవాణే సంగీతం అందించాలి. సుకుమార్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్. కీరవాణి ఒక దశలో రిటైర్మెంట్ తీసుకుంటాననడంతో రాజమౌళి వేరే ఆప్షన్ చూసుకుంటాడేమో అనిపించింది. కానీ ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జక్కన్నతో కలిసి సాగిపోతున్నాడు. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. దేవిశ్రీ ఫామ్ కొంచెం దెబ్బ తిన్నాక కూడా తనతోనే సాగుతూ వచ్చాడు. ‘రంగస్థలం’ టైంలో దేవి జోరు కొంచెం తగ్గింది. కానీ అతడినే కొనసాగించాడు. తనూ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
‘పుష్ప’కు కూడా వీరి బంధం కొనసాగింది. మ్యూజిక్ విషయంలో మంచి అప్లాజే వచ్చింది. ఐతే పుష్ప-2 దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి మధ్య సింక్ కుదరట్లేదని తెలుస్తోంది. దేవి ఇచ్చిన బీజీఎం నచ్చక వేరే సంగీత దర్శకుల వైపు సుకుమార్ చూస్తున్నాడన్న వార్త టాలీవుడ్లో దావానలంలా వ్యాపించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.
గతంలో త్రివిక్రమ్ సహా పలువురు దర్శకులకు దేవి మీద మంచి గురి ఉండేది. కానీ ఒక దశ దాటాక తన సంగీతంలో వాడి తగ్గడంతో ఒక్కొక్కరుగా అతణ్ని పక్కన పెట్టేశారు. కానీ సుకుమార్ మాత్రం ఒకప్పుడు తన సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించి వాటి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన దేవిని కొనసాగిస్తూ వచ్చాడు.
దేవిని కష్టపెట్టి, విసిగించి అయినా మంచి మ్యూజిక్ చేయించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు సుకుమార్ కూడా దేవి మీద నమ్మకం కోల్పోయాడంటే తన సంగీతం ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లలో దేవి స్థాయికి తగని సినిమాలు చాలానే వచ్చాయి.
కానీ ఇప్పుడు సుకుమార్ నమ్మకం కోల్పోయి విడుదల ముంగిట బీజీఎం కోసం ఆయన వేరే సంగీత దర్శకుల వైపు చూసే పరిస్థితి వచ్చిందంటే దేవికి ఇది మామూలు డ్యామేజ్ కాదు. దీన్ని అతనెలా తీసుకుంటాడు.. సుక్కుతో మున్ముందు తన ప్రయాణం ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 7, 2024 4:46 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…