జాన్వీ కపూర్… కెరీర్ పరంగా తల్లి శ్రీదేవీ వారసత్వాన్ని మాత్రమే కాకుండా పాటు ఆచారాలను భక్తిని కూడా కంటిన్యూ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో మొన్నటివరకు చాలా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ వాతావరణంకు మరింత దగ్గరవుతోంది. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది.
ఆమె చేసిన తంగం పాత్ర ఎలా ఉన్నా కూడా తెలుగు జనాలకు మాత్రం జాన్వీ దగ్గరవుతోంది. ఇక రామ్ చరణ్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికైన జాన్వీ కపూర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ పరిసరాల్లో జరుగుతోంది.
అయితే సినిమా షూటింగ్‌లో తీరిక దొరికినప్పుడల్లా జాన్వీ కపూర్ హైదరాబాద్ సిటీలోని గుళ్లను సందర్శింస్తోంది. ఈరోజు హైదరాబాద్ అమీర్ పేట దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. గురువారం (నవంబర్ 07) న ఆ ఆలయాన్ని సందర్శించి, సుమారు అరగంట పాటు పూజలు చేసిన జాన్వీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
జాన్వీ రాకతో ఆలయం వద్ద అభిమానుల జనం భారీగా గుమికూడారు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఆమె మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. ఇక లిస్టులో నాగచైతన్య, నాని ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులపై మరింత క్లారిటీ రానుంది.
This post was last modified on November 7, 2024 2:08 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…