మొన్నటి ఏడాది విక్రమ్ రూపంలో తిరుగులేని బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఘనమైన కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించడం అభిమానులు మర్చిపోయే విషయం కాదు. అయితే ఇండియన్ 2 మీద గంపెడాశలు పెట్టుకుంటే ఆది దారుణంగా డిజాస్టర్ కావడం జీర్ణించుకోలేకపోయారు. లోకనాయకుడి మార్కెట్ తిరిగి వచ్చేసిందని ఆనంద పడుతున్న సమయంలో దర్శకుడు శంకర్ ఇచ్చిన షాక్ తీవ్ర నష్టాలు తీసుకొచ్చింది. ఇండియన్ 3 ఓటిటిలో నేరుగా వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్స్ ఆశలన్నీ ధగ్ లైఫ్ మీద ఉన్నాయి. విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
కమల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 జూన్ 5 థియేటర్లలో అడుగు పెడుతుందని ఒక చిన్న టీజర్ ద్వారా రివీల్ చేశారు. షూటింగ్ పూర్తయిపోయి రెండు నెలలవుతున్నా అంత ఆలస్యంగా విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో కానీ విక్రమ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం విక్రమ్ జూన్ 3 వచ్చింది. ఇప్పుడు అదే నెలలో ధగ్ లైఫ్ ని తీసుకొస్తున్నారు. నిజానికి సంక్రాంతి బరిలో ఉంటుందని కోలీవుడ్ ట్రేడ్ ఆశించింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు చాలా ఉండటంతో హడావిడి పడటం ఇష్టం లేని కమల్ హాసన్ వేసవిలో రావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ధగ్ లైఫ్ వెనుక ప్రధాన విశేషం ఒకటుంది. ఆల్ టైం కల్ట్ క్లాసిక్ నాయకుడు తర్వాత కమల్, దర్శకుడు మణిరత్నం చేతులు కలిపింది ఈ సినిమాతోనే. మూడు దశాబ్దాలకు పైగా ఉన్న సుదీర్ఘమైన గ్యాప్ కు తగ్గట్టు బెస్ట్ మూవీ ఇవ్వాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్ తో ధగ్ లైఫ్ తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా త్రిష హీరోయిన్ గా నటించింది. శింబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ బ్యానర్ గత చిత్రాలు విక్రమ్, అమరన్ ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రేష్ట్ మూవీస్ (నితిన్ ఫ్యామిలీ) కే దీని హక్కులు దక్కడం దాదాపు ఖరారు. ఇంకా అఫీషియల్ చేయలేదు.
This post was last modified on November 7, 2024 11:49 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…