టాలీవుడ్లో మరోసారి చిన్న సినిమాల జాతర చూడబోతున్నాం. ఈ వీకెండ్లో ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో నిఖిల్ సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కొంచెం స్థాయి ఉన్న సినిమా.
మిగతావన్నీ చిన్న చిత్రాలే. వీటిలో ‘ధూమ్ ధామ్’ అనే చిన్న సినిమా ఫన్నీ ట్రైలర్‌తో కొంతమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో కథానాయకుడిగా నటించిన చేతన్ కృష్ణ.. తమ సినిమాకు చాలినన్ని థియేటర్లు ఇవ్వకపోవడంపై ప్రమోషనల్ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వారం ఇన్ని చిన్న సినిమాలు రిలీజవుతుంటే.. వాటిని కాదని ఓ చిన్న స్థాయి తమిళ అనువాద చిత్రానికి థియేటర్లు ఎక్కువ ఇవ్వడాన్ని అతను తప్పుబట్టాడు. ఆల్రెడీ తమిళంలో విడుదలై వారం ఆలస్యంగా వస్తున్న సినిమాకు థియేటర్లు ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని అతను ఆరోపించాడు.
ఆ సినిమా పేరు చెప్పలేదు కానీ.. అది ‘బిగ్ బాస్’ ఫేమ్ కవిన్ లీడ్ రోల్ చేసిన ‘బ్లడీ బెగ్గర్’. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలైంది. యావరేజ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ‘అమరన్’ ముందు నిలవలేక ఫ్లాప్ అయింది. ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. తెలుగులో ఈ మూవీని ఏషియన్-సురేష్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో కావాల్సినన్ని థియేటర్లు ఇస్తున్నారు.
ఐతే గత వారం దీపావళి కానుకగా వచ్చిన క, లక్కీ భాస్కర్, అమరన్ ఇంకా బాగా ఆడుతుండగా.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజవుతుండడంతో థియేటర్ల సమస్య తప్పట్లేదు. ఓవైపు ‘క’ మూవీని తమిళంలో రిలీజ్ చేద్దామంటే దీనికి థియేటర్లే ఇవ్వలేదు. ‘దేవర’ లాంటి పెద్ద సినిమాకు సైతం తమిళంలో థియేటర్ల సమస్య తప్పలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే తమిళ చిత్రాలకు మాత్రం థియేటర్లు కావాల్సినన్ని ఇస్తున్నారు.
తెలుగు సినిమాలకు తగ్గించి మరీ డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇస్తుండడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ తెలుగు చిత్రాలను కాదని.. తమిళంలో వారం ముందే విడుదలై, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వడంపై చేతన్ ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పేమీ కనిపించదు.
This post was last modified on November 6, 2024 9:48 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…