Movie News

బ్లాక్ బస్టర్ ‘క’….ప్యాన్ ఇండియా రిలీజ్ డేట్లు

ఊహించిన దానికన్నా పెద్ద స్థాయిలో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ‘క’ ఇతర భాషల్లోకి వెళ్తోంది. అలాని రీమేక్ కాదండోయ్. దర్జాగా డబ్బింగ్ చేసుకుని ఒరిజినల్ వెర్షన్ రూపంలోనే రిలీజ్ కాబోతోంది. ముందుగా మలయాళంలో నవంబర్ 15 విడుదల కానుండగా తమిళం, హిందీలో వారం ఆలస్యంగా నవంబర్ 22 రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ‘క’ ఈవెంట్లలో కిరణ్ మాట్లాడుతూ అమరన్ తో పాటు ఇతర కోలీవుడ్ సినిమాల పోటీ వల్ల చెన్నైలో కనీసం ఒక్క షో దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేయడం గుర్తే. ఇప్పుడది తీరేలా అక్కడి డిస్ట్రిబ్యూటర్ తగినన్ని స్క్రీన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

రెండో వారంలోకి అడుగుపెట్టే ముందే ముప్పై కోట్ల గ్రాస్ దాటిన ‘క’ తీవ్రమైన పోటీని తట్టుకుని ఇంత వసూళ్లు రాబట్టడం విశేషమే. క్లైమాక్స్ నచ్చకపోతే ఇకపై సినిమాలు మానేస్తానని కిరణ్ అబ్బవరం ఛాలెంజ్ చేయడం కొద్దిరోజుల క్రితం హాట్ టాపిక్ గా మారింది. కుర్రాడు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అనుకున్నారు. కట్ చేస్తే ‘క’కు చివరి ఘట్టమే ఆయువు పట్టుగా నిలిచి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. పక్క రాష్ట్రాల్లో మార్కెట్ ఏర్పరుచుకోవడానికి కిరణ్ కు మంచి ఛాన్స్ దొరుకుతుంది. తమిళనాడు, కేరళతో పాటు నార్త్ లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే హక్కుల రూపంలో కొత్త మార్కెట్ ఏర్పడుతుంది.

లేట్ అయ్యిందని అనుకోవడానికి లేదు. గతంలో కాంతార ఇదే కారణాల వల్ల తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా వచ్చింది. అయినా సరే బ్లాక్ బస్టర్ కు తగ్గకుండా ఫలితం దక్కించుకుంది. అలాంటి సీనే ఇప్పుడు ‘క’కు ఆశిస్తున్నారు నిర్మాతలు. సందీప్ – సుజిత్ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ లో నయన్ సారిక హీరోయిన్ కాగా సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. ఆర్టిస్టుల పరంగా చేసుకున్న కూర్పు ఇప్పుడు ప్యాన్ ఇండియా పరంగా దోహదపడేలా ఉంది. ఈ వారం టాలీవుడ్ నుంచి కొత్త సినిమాలు చాలానే ఉన్నప్పటికీ ‘క’ ఇప్పుడప్పుడే విపరీతంగా నెమ్మదించదని ట్రేడ్ టాక్.

This post was last modified on November 6, 2024 3:49 pm

Share

Recent Posts

హైదరాబాద్ ఐమాక్స్ వారణాసికి ముందే

దేశంలోనే అత్యధిక‌ సినీ అభిమానం ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశ‌యోక్తేమీ కాదు. కానీ ఇంత‌టి అభిమానం ఉన్న చోట…

38 minutes ago

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

3 hours ago

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

3 hours ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

3 hours ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

4 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

4 hours ago