Movie News

చైతూ-సాయిపల్లవి.. గ్రేట్ ఎస్కేప్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన తండేల్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ తొలగిపోయింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్, సంక్రాంతి రెండు పండగలకూ కాదని.. ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా షూట్ ఇంకా మిగిలి ఉండడం, సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ రెండు సీజన్లనూ వదిలేసి ఫిబ్రవరి 7న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. దీని మీద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి టీం వివరణ ఇచ్చింది.

ఈ ప్రెస్ మీట్‌ను చిన్న సైజ్ ఈవెంట్ లాగా చేసింది టీం. వేదిక మీద టీం సభ్యులందరూ మాట్లాడాక.. మీడియా వాళ్లతో క్వశ్చన్-ఆన్సర్ మీట్‌ను కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఐతే ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు.. దర్శకుడు చందూ మొండేటి మాత్రమే పాల్గొన్నారు.

చైతూ, సాయిపల్లవిలను మీరే పంపించేశారా అంటూ ఓ మీడియా ప్రతినిధి.. అల్లు అరవింద్‌ను ప్రశ్నించగా ఆయన నవ్వుతూ అవునని సమాధానం చెప్పారు. దీని మీద ఇంకేమీ మాట్లాడలేదు. ఐతే చైతూ, సాయిపల్లవిలకు ఏదో పని ఉండి వెళ్లిపోయినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లిద్దరూ సైడ్ అయిపోయారని తెలుస్తోంది. వీళ్లిద్దరినీ సినిమాయేతర ప్రశ్నలతో మీడియా వాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశముండడంతో సినిమా ప్రమోషన్ పక్కకు వెళ్లిపోతుందన్న ఉద్దేశంతోనే పంపించేశారని భావిస్తున్నారు.

చైతూ ఇటీవలే శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరోవైపు అక్కినేని కుటుంబం, సమంత గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలపై చైతూను మీడియా వాళ్లు కచ్చితంగా ప్రశ్నించేవాళ్లు. మరోవైపు సాయిపల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇండియన్, పాకిస్థాన్ ఆర్మీల గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తిరిగాయి. ఆమె సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్స్ చేశారు. ఈ విషయం మీద మీడియా వాళ్లు ప్రశ్నించి ఉండేవాళ్లు. ఈ ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమయ్యేది. దానికి అనుబంధంగా ఏం మాట్లాడినా మళ్లీ కాంట్రవర్శీ అయ్యేది. దీని వల్ల సినిమా గురించిన చర్చ పక్కకు వెళ్లిపోయేది. అందుకే అరవింద్ తెలివిగా చైతూ, సాయిపల్లవిలను ముందే పంపించేశారని భావిస్తున్నారు.

This post was last modified on November 6, 2024 2:19 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

47 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago