ఇటీవలే అబుదాబిలో నిర్వహించిన ఐఫా అవార్డుల వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టైల్‌ను అనుకరిస్తూ ఈ వేడుకకు యాంకర్లుగా వ్యవహరించిన రానా దగ్గుబాటి, తేజ సజ్జా తమ మీద తాము జోకులు వేసుకుంటూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల మీద కూడా పంచులు వేశారు.
ఐతే అందులో కొన్ని కౌంటర్లు ఆయా హీరోల అభిమానులకు నచ్చట్లేదు. సంక్రాంతికి మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ మీద తేజ మూవీ ‘హనుమాన్’ పైచేయి సాధించిన విషయం మీద రానా, తేజ ప్రస్తావిస్తూ సెటైరికల్‌గా మాట్లాడ్డం మహేష్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. నిన్నట్నుంచి వాళ్లు వీళ్లిద్దరి మీద సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ అభిమానులకు రవితేజ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు.
మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ గురించి రానా వేసిన పంచ్ మాస్ రాజా అభిమానులను బాధ పెట్టినట్లే కనిపిస్తోంది. దీని గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. మనల్ని చూసి నవ్వుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో అభిమాని ‘మిస్టర్ బచ్చన్’ దర్శకుడు హరీష్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ రవితేజతో మరో సినిమా తీసి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేయాలని కామెంట్ చేశాడు.
దీనిపై హరీష్ శంకర్ కూడా స్పందించాడు. “ఎన్నో విన్నాను తమ్ముడు. అందులో ఇదోటి. అన్ని రోజులూ ఒకలా ఉండవు. నాకైనా ఎవరికైనా” అంటూ వేదాంత ధోరణిలో రిప్లై ఇచ్చాడు హరీష్. మామూలుగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో మంచి టెంపర్ మీద ఉంటాడు. తన మీద పంచ్ వేస్తే తిరిగి గట్టిగా కౌంటర్ ఇస్తాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ ఫెయిల్యూర్ తర్వాత ఆయన కొంచెం దూకుడు తగ్గించాడు. ఈ క్రమంలోనే ఇలా వేదాంత ధోరణిలో సమాధానం చెప్పినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 6, 2024 2:20 pm
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…