ఊహించని స్థాయిలో తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్ గా నిలిచిన అమరన్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో కొంత నెమ్మదించినా రెండో వీకెండ్ లో మళ్ళీ వసూళ్ల తాకిడి ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. ఇక్కడ పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టినా టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాను ఆదరించిన తీరు అనూహ్యం. లక్కీ భాస్కర్, క లాంటి స్ట్రెయిట్ సినిమాల పోటీని తట్టుకుని ఇంత స్పందన దక్కించుకోవడం ట్రేడ్ సైతం ఊహించలేదు. సాయిపల్లవి నటన, ఎమోషన్స్, మేజర్ సాహసం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నాయి.
అయితే చాలామంది మనసులో ఒక సందేహం ఉండిపోయింది. కథ ప్రకారం సాయిపల్లవి పోషించిన ఇందూ పాత్రని క్రిస్టియన్ గా స్పష్టంగా చూపించారు. ఆమె కుటుంబ బ్యాక్ గ్రౌండ్, ఆచార వ్యవహారాలు, చర్చికి వెళ్లడం లాంటివి చాలా ఉన్నాయి. కానీ మేజర్ ముకుంద్ ఏ కులమనేది చూపించలేదు. అంతగా హైలైట్ చేయకపోయినా కనీసం మాట వరసకైనా చెప్పి ఉండాల్సిందనేది కొందరు చేస్తున్న వాదన. దీని గురించి దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి క్లారిటీ ఇచ్చారు. అమరన్ కథను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు మేజర్ తల్లితండ్రులు అసలు కుల ప్రస్తావనే వద్దని చెప్పారట.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కొడుకు ఒక ఇండియన్, తమిళుడిగానే ప్రజలు గుర్తించాలి తప్పించి కులం ఆధారంగా కాదని చెప్పడంతో రాజ్ కుమార్ ఆ అంశాన్ని సున్నితంగా హ్యాండిల్ చేశాడు. ఇందు వైపు నుంచి అభ్యంతరం రాకపోవడంతో వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ని యధాతథంగా చూపించారు. ఇది గొప్ప విషయం. ముకుంద్ వరదరాజన్ దేశభక్తితో పాటు తన అమ్మానాన్నా ఉన్నతాశయాలు కూడా ప్రపంచానికి దీని ద్వారా పరిచయమయ్యాయి. హిందువుగా గుడిలో పెళ్లి చేసుకున్న సీన్ తప్ప ముకుంద్ కులానికి సంబంధించి ఇంకేం చూపించని రాజ్ కుమార్ అన్నమాట నిలబెట్టుకున్నారు.
This post was last modified on November 6, 2024 11:44 am
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…