బాలీవుడ్ కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు చెప్పబడుతున్న రామాయణ ఇంకా ఫస్ట్ లుక్ వదలకుండానే విడుదల తేదీలు బ్లాక్ చేసుకుంది. మొదటి భాగం 2026 దీపావళి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండు సంవత్సరాల ముందే ఒక ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు వస్తుందో అధికారికంగా చెప్పడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రస్తుతం కొంత భాగం ఆల్రెడీ పూర్తి చేసుకున్న ఈ ఇతిహాస గాధకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ కూడా వెయ్యి కోట్లని అంటున్నారు కానీ ఇంకా స్పష్టత లేదు.
రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న రామాయణలో యష్ రావణుడిగా నటించడమే కాక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సన్నీ డియోల్ ని హనుమంతుడి పాత్రకు తీసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా చేసిందనే ప్రచారం బలంగా ఉంది. అయితే ఇప్పటిదాకా క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రమోషన్లు ఎప్పుడు మొదలుపెట్టాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ మధ్య రన్బీర్, సాయిపల్లవిల లీక్ ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొట్టాయి. టీమ్ అలెర్టయిపోయి తీయించేసింది.
ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రామాయణ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఎవరు తీయాలన్నా ఇంతకన్నా గొప్పగా చేయలేమనే రీతిలో ఉంటుందని నితేశ్ తివారి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంత ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది కాబట్టి యష్ విలన్ గా చేయడంతో పాటు పార్ట్ నర్ అయ్యేందుకు ఒప్పుకున్నాడు. యానిమల్ లాంటి వయొలెంట్ సబ్జెక్టు తర్వాత రన్బీర్ కపూర్ రాముడిగా ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి జనంలో లేకపోలేదు.సీతగా సాయిపల్లవి కన్నా బెస్ట్ ఛాయస్ ఆలోచించనక్కర్లేదు. మరి రెండు సంవత్సరాలు రామాయణకి పోటీ వచ్చేదెవరో.
This post was last modified on November 6, 2024 11:41 am
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…