న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ షూటింగ్ ప్రస్తుతం ఒక అరుదైన లొకేషన్ లో జరుగుతోంది. అందులో విశేషం ఏంటో దాని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాకు 80 కిలోమీటర్ల దూరంలో సంభార్ ఉప్పు సరస్సు ఉంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద లోతట్టు ఉప్పు సరస్సు. మొత్తం ఆరు నదుల నీరు దీంట్లో వచ్చి చేరుతుంది. మంథా, రూపన్ గడ్, ఖరీ, ఖండేలా, మొడ్తా, సమోద్ వాటి పేర్లు. సంభార్ పరివాహక ప్రాంతం 5700 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. సరస్సు చుట్టుకొలత 96 కిలోమీటర్లు.
మరో విశేషం ఏంటంటే వేసవిలో 45 డిగ్రీలు ఉండే వాతావరణం శీతాకాలంలో 5 కంటే తక్కువకు పడిపోతుంది. అంటే అక్కడి చలిని తట్టుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి ప్రాంతంలో హిట్ 3 ఏం చేస్తుందంటే సస్పెన్స్ అంటోంది టీమ్. శైలేష్ కొలను హిట్ సిరీస్ లోని మొదటి రెండు భాగాలూ తక్కువ బడ్జెట్ లో తీశాడు. అది కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి లొకేషన్లలో పూర్తి చేశాడు. బయటికి వెళ్లే ప్రసక్తే రాలేదు. కానీ హిట్ 3 విషయంలో అలా రాజీపడటం లేదు. సబ్జెక్టు పరంగా డిమాండ్ మేరకు అరుదైన ప్రాంతాలకు వెళ్తున్నారు. నిర్మాతగానూ ఉన్న నాని దేంట్లోనూ కాంప్రమైజ్ కావడం లేదు.
వేగంగా పూర్తి చేసుకునే లక్ష్యంతో పరుగులు పెడుతున్న హిట్ 3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్నాడు. దసరాని మించిన మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ రెండు సినిమాల్లో ఉంటాయని నాని సరిపోదా శనివారం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పడం గుర్తేగా. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఇవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కు సిద్ధపడుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ ఏదైనా అనూహ్యంగా పోటీకి దిగితే తప్ప డేట్ మార్చుకునే ఉద్దేశంలో లేదు. సైంధవ్ ఫలితం పట్ల కసిగా ఉన్న శైలేష్ కొలను ఈసారి బ్లాక్ బస్టర్ కోసం బాగా కష్టపడుతున్నారు.
This post was last modified on November 6, 2024 2:21 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…