తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ డిసెంబర్ 20 వదులుకోవడానికి గల కారణాలు వివరించారు. ఒక పెద్ద సముద్రాన్ని సృష్టించి, ఒక తుఫాను దాని మీద చూపించడం లాంటి ఎన్నో రిస్కీ ఎపిసోడ్లు ఇందులో ఉన్నాయని, ఎంత విఎఫెక్స్ వాడినా క్వాలిటీ కోసం వాటి మీద పని చేసేవాళ్లకు తగినంత సమయం ఇవ్వాలి కాబట్టి దాని కోసమే డెడ్ లైన్ పెట్టుకుని పని చేయలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 22 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందని అందుకే ముందు చెప్పిన డేట్ అందుకోలేదని అన్నారు.
వాఘా సరిహద్దుల దగ్గర పర్మిషన్లు, వేరే దేశాల జెండాను షిప్పుల మీద చూపించడానికి కావాల్సిన అనుమతులు, అవుట్ డోర్ కు సంబంధించిన వ్యవహారాలు ఇలా బోలెడు అంశాలు ప్రభావితం చేశాయని అన్నారు. 100 పర్సెంట్ లవ్ ద్వారా తనను ప్రొడ్యూసర్ గా లాంచ్ చేసిన నాగ చైతన్యకు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తండేల్ కోసం అందరూ విపరీతంగా కష్టపడుతున్నామని, ఈసారి వంద కోట్ల గ్రాస్ సినిమాని చైతుకి కానుకగా ఇవ్వబోతున్నామని అక్కినేని అభిమానులకు హామీ ఇచ్చేశారు. ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే తండేల్ అంచనాలు అందుకుని అన్నంత పని చేసేలానే ఉంది.
సో బన్నీ వాస్ చెప్పినదాన్ని బట్టి చూస్తే తండేల్ షూటింగ్ మొత్తం పూర్తవ్వడానికి డిసెంబర్ చివరి వారం లేదా జనవరి వచ్చేలా ఉంది. విపరీతమైన అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఓవర్ సీస్ నుంచి అరకులోని చిన్న పల్లెటూరి దాకా ప్రతి సెంటర్ లో సినిమా రిలీజై మంచి కలెక్షన్లు రావాలంటే టైమింగ్ చాలా ముఖ్యమని, అందుకే తండేల్ కు దొరికిన అద్భుతమైన డేట్, అంతకు మించిన సూపర్ కంటెంట్ తో వసూళ్ల సునామి సృష్టిస్తుందని అన్నారు. మొత్తానికి డేట్ విషయంలో ఫ్యాన్స్ లో గూడుకట్టుకున్న కాసింత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో తండేల్ టీమ్ సక్సెసయ్యిందనే చెప్పాలి.
This post was last modified on November 5, 2024 5:08 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…