ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్ అనే ట్రెండ్ పాపులర్ అయింది. ‘లియో’ సినిమా రిలీజైనపుడు ‘ఎల్‌సీయూ’ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు లోకేష్ నుంచి ‘కూలీ’ సినిమా రాబోతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటించడంతో సినిమాపై మామూలు అంచనాలు లేవు. పైగా అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి వేరే ఇండస్ట్రీల స్టార్లు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తుండడంతో హైప్ ఇంకా పెరిగింది. వీరికి తోడు ఆమిర్ ఖాన్ సైతం ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్‌ను ‘కూలీ’లో ఆమిర్ క్యామియో గురించి అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు. సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ అయినా అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ నుంచే రావాలని.. తాను రివీల్ చేయలేనని అతను చెప్పాడు. ఐతే వేరే రాష్ట్రం లేదా దేశానికి చెందిన ఒక స్పెషల్ వ్యక్తి ఈ చిత్రంలో నటిస్తుండొచ్చు అంటూ ఆమిర్ క్యామియో గురించి చెప్పకనే చెప్పాడు లోకేష్.
ఇక ‘కూలీ’ సినిమాలో ఇంత మంది పెద్ద నటులు నటించడం గురించి మాట్లాడుతూ.. ఇదేదో స్టార్లందరినీ తీసుకొచ్చి క్యామియోలు చేసి మసిబూసి మారేడుకాయను చేసే టైపు సినిమా కాదని.. ప్రతి ఒక్కరి పాత్రలూ కథకు అనుగుణంగానే ఉంటాయని.. ప్రాపర్ స్టోరీ ఉన్న సినిమా ఇదని లోకేష్ తెలిపాడు. ‘లియో’ సినిమా సెకండాఫ్ విషయంలో తన అంచనా తప్పిందని.. ఆ సినిమా నుంచి పాఠాలు నేర్చుకుని ‘కూలీ’ తీస్తున్నానని.. ఇది తన సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగం కాదని.. స్టాండ్ అలోన్ ఫిలిం అని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on November 5, 2024 4:05 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…