సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ప్రభాస్ లాంటి టాప్ స్టార్ తనతో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు. సందీప్ ఇప్పటిదాకా తీసింది మూడు సినిమాలు, అందులో రెండు సినిమాలు ఒకే కథతో వేర్వేరు భాషల్లో తెరకెక్కాయి. అయినా తన క్రేజ్ మామూలుగా లేదు. తన పేరు మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతోందిప్పుడు.
ఇంత క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. తొలి చిత్రం రిలీజవడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ‘అర్జున్ రెడ్డి’ కథతో అతను చాలా ఏళ్ల పాటు ట్రావెల్ చేసి.. దాన్ని సినిమాగా మలచడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి సందీప్ మరీ ఎక్కువగా చెప్పుకుంది లేదు. ఐతే తాజాగా స్టార్ రైటర్ కోన వెంకట్.. సందీప్‌తో తనతో పంచుకున్న కష్టాల గురించి ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడాడు.
‘అర్జున్ రెడ్డి’ కథ మీద సందీప్ ఐదేళ్లు పట్టుబట్టి కూర్చున్నా ఆ సినిమా పట్టాలెక్కలేదని కోన వెంకట్ వెల్లడించాడు. ముందు ఒక హీరోకు ఈ కథ నచ్చి సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడని.. తన ఆఫీస్‌లో ఆ కథ మీద వర్క్ చేసే అవకాశం కల్పించాడని కోన తెలిపాడు. ఐతే తనకు పెద్దగా సౌకర్యాలేమీ కల్పించలేదని.. ఒక మూలన ఒక సీట్ ఇచ్చి కథ మీద వర్క్ చేయమన్నాడని.. రోజూ తనకు భోజనం మాత్రం పెట్టేవారని కోన చెప్పాడు. చూద్దాం చేద్దాం అంటూనే ఆ హీరో మూడేళ్లు గడిపేశాడని.. అతడికి సినిమా చేసే ఉద్దేశం లేదని చివరికి అర్థమయ్యాక సందీప్ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడని తెలిపాడు.
ఆ తర్వాత ఇంకో హీరో ఆ కథ మీద ఆసక్తి చూపించాడని.. కానీ అతను కూడా రెండేళ్ల పాటు వెనుక తిప్పించుకున్నాడే తప్ప సినిమా చేయలేదని.. ఒక డాక్టర్ అయి ఉండి తన తమ్ముడు పడుతున్న కష్టం చూడలేక చివరికి సందీప్ అన్నయ్యే డబ్బులు పెట్టి సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని.. ఆస్తులు అమ్మి సినిమా తీశాడని.. సందీప్ విజన్‌ను నమ్మి విజయ్ దేవరకొండ కూడా సపోర్ట్ చేయడంతో ఆ సినిమా బయటికి వచ్చిందని కోన వెంకట్ ఈ సినిమా వెనుక కథను వివరించాడు.
This post was last modified on November 5, 2024 4:01 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…