హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్ లాంచ్ తో మొదలుకాబోతున్నాయి. నవంబర్ 9న ఈ ఈవెంట్ ని లక్నోలో ఘనంగా నిర్వహించబోతున్నట్టు సమాచారం. టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. మొదటి నేషనల్ ఈవెంట్ కావడంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలిసింది. కియారా అద్వానీ, ఎస్జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులంతా రాబోతున్నారు. ఇప్పటికే జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా అంచనాల త్రాసు అటుఇటు తిరుగుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు టీజర్ ఎలా ఉండబోతోందనే దాని మీదే ఉన్నాయి.
థియేట్రికల్ గా టీజర్ ని విడుదల చేసే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇంకో రెండు రోజుల్లో వెల్లడి కాబోతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఒక్కో ఈవెంట్ చేసేలా దిల్ రాజు టీమ్ సమాయత్తం అవుతోంది. చివరిది తిరుపతిలో చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా షెడ్యూల్ చేయబోతున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సైతం దిల్ రాజు బ్యానరే కావడంతో కార్యక్రమాల పరంగా క్లాష్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది.
అభిమానులు మాత్రం ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కౌంట్ డౌన్ పోస్టర్స్ లాంటివి వదలమని కోరుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటల్లో రా మచ్చా బాగా రీచ్ తెచ్చుకోగా జరగండి జరగండి మీద డాన్స్ పరంగా అంచనాలున్నాయి. మిగిలిన మూడు సాంగ్స్ ని టీజర్ తర్వాత రిలీజ్ చేస్తారు. పొలిటికల్ జానర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. సరిపోదా శనివారం తర్వాత అంతకు మించిన ఇంటెన్స్ క్యారెక్టర్ ఎస్జె సూర్యకు దక్కింది. జనవరి 10 గేమ్ ఛేంజర్ థియేటర్లలో అడుగుపెడతాడు.
This post was last modified on November 5, 2024 11:10 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…