Movie News

ముగ్గురు హీరోలు కలిస్తే రచ్చే

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ తన తండ్రి బెల్లంకొండ సురేష్ ఎంత మంచి కాంబినేషన్లు సెట్ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఇంకా కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. హిందీలో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ దారుణంగా బోల్తా కొట్టడంతో శ్రీనివాస్ కొంచెం తగ్గాడు. కానీ ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న శ్రీనివాస్.. తాజాగా ఒక మాస్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. భైరవం.

‘నాంది’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బలమైన ముద్ర వేసిన విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ మీద కేకే రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించేదే. గత కొన్నేళ్లుగా పల్లెటూరి నేపథ్యంలో దేవుడితో ముడిపడ్డ మిస్టరీ సినిమాలు బాాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ ‘భైరవం’ టీం కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీనివాస్ రగ్డ్ లుక్ ఈ సినిమాకు బాగానే సెట్ అయినట్లు కనిపిస్తోంది. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్‌తోనే ‘ఉగ్రం’ అనే మరో సినిమా చేశాడు విజయ్ కనకమేడల. కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘భైరవం’తో రాబోతున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరికొందరు పేరున్న టెక్నీషియన్లే పని చేస్తున్నారు.

This post was last modified on November 4, 2024 11:00 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

5 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago