నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్ ఉచ్చులో పడి ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడు కానీ లేదంటే కనీసం రెండు మూడు కొత్త రిలీజులు ఉండేవి. సరే జరిగిందేదో జరిగిపోయింది కానీ వచ్చే ఏడాది నుంచి మాత్రం కుర్రాడు స్పీడ్ పెంచబోతున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడుతో పాటు మరో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే వీటికన్నా ముందు ఒక రీమేక్ సర్ప్రైజ్ సిద్దమవుతోంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ కలయికలో రూపొందుతున్న మల్టీస్టారర్ కు ‘భైరవం’ టైటిల్ ని ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పేర్కొనప్పటికీ సంక్రాంతి లేదా ఫిబ్రవరి వైపు చూస్తున్నారని సమాచారం. కుదిరితే క్రిస్మస్ ఆప్షన్ కూడా పెట్టుకున్నారట. ఈ భైరవం తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్. సూరి ప్రధాన పాత్ర పోషించగా కమర్షియల్ గా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మూడు అంశాలు కీలకంగా ఉంటాయి. స్నేహం, దేవుడి భూముల అన్యాక్రాంతం, మిత్రద్రోహం వీటి చుట్టే దురై సెంథిల్ కుమార్ ఒరిజినల్ వెర్షన్ కథను నడిపారు.
తెలుగు రీమేక్ కు నాంది – ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇతర క్యాస్టింగ్, సాంకేతిక వర్గాలు వివరాలు వెల్లడించకుండా చకచకా కానిచ్చేస్తున్నారు. ఇలాంటి నేటివిటీ తెలుగులోనూ వర్కౌట్ అవుతుంది కానీ కొన్ని కీలకమైన మార్పులు అవసరమైన ఈ సబ్జెక్టులో వాటి మీద ఎంత మేరకు పని చేశారో సినిమా చూశాక కానీ క్లారిటీ రాదు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ విలేజ్ యాక్షన్ డ్రామాలో కీలకమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను మనోజ్ దక్కించుకున్నట్టు టాక్. సో విడుదల పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on November 4, 2024 5:14 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…