అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ, తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా భాషల్లో బఘీరా రిలీజైన సంగతి తెలిసిందే. శ్రీమురళి హీరోగా నటించగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మీద అంతో ఇంతో ఆసక్తి రేగడానికి కారణాలు రెండు. ఒకటి కెజిఎఫ్ – సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కథను అందించడం. మరొకటి హోంబాలే ఫిలిమ్స్ గ్రాండ్ ప్రొడక్షన్. దీంతో సహజంగానే అంచనాలు రేగాయి. అయితే దీపావళి రోజు విడుదలైన బఘీరాకు యునానిమస్ ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూలు విషయం లేదంటూ తేల్చి పారేశాయి.
దీంతో సహజంగా మొదటి రోజు ఉన్న స్క్రీన్లు షోలు ఏపీ, తెలంగాణలో గణనీయంగా తగ్గించేశారు. మంచి టాక్ తెచ్చుకున్న క, అమరన్, లక్కీ భాస్కర్ లకు అవసరానికి తగ్గట్టు సర్దుబాటు చేశారు. దీంతో కొందరు శాండల్ వుడ్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. బఘీరాని ఉద్దేశపూర్వకంగా కిల్ చేశారని, కావాలని వన్ టూ రేటింగ్స్ ఇచ్చి నెగటివ్ గా మార్చారని ఇలా ఏవేవో ఊహించేసుకుని డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ సోషల్ మీడియా వేదికగా శపథం చేస్తున్నారు. ఇంతకన్నా జోక్ మరొకటి ఉండదు. బఘీరాలో కంటెంట్ వీకని ఎవరైనా ఒప్పుకుంటారు. దానికింత రాద్ధాంతం అనవసరం.
వాళ్ళ మనసులో ఏమున్నా పుష్ప 2 బజ్ కంట్రోల్ చేయడం అసాధ్యం. అసలే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కర్ణాటకలో రికార్డు ఓపెనింగ్స్ తెస్తానని అక్కడి డిస్ట్రిబ్యూటర్ స్టేజి మీద ఆల్రెడీ సవాల్ చేశాడు. అల్లు అర్జున్ కి అక్కడ పెద్ద ఫాలోయింగ్ ఉంది. బయ్యర్లు తాముగా ముందుకొచ్చి పోటీపడి మరీ షోలు వేసుకుంటారు. అసలు దీనికి భయపడే కదా కన్నడనే కాదు ఇతర భాషల్లోనూ పుష్ప 2కి పోటీగా ఎవరూ కొత్త సినిమాలు రిలీజ్ చేయడం లేదు. అయినా బఘీరా బాగోకపోతే అది సినిమా సమస్య కానీ దాన్ని దేనికో ముడిపెడితే ఎలా. ఆ మాటకొస్తే ‘క’కు బెంగళూరులో షోలే సరిగా ఇవ్వలేదు. మరి దానికేం చేయాలో.
This post was last modified on November 4, 2024 4:09 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…