హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు వెల్లువెత్తవు. ఇస్మార్ట్ శంకర్ లో నటించాక నిధి అగర్వాల్ కు ఇది అనుభవమయ్యింది. తర్వాత రెండు మూడు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అశోక్ గల్లా సరసన హీరో లాంటి పెద్ద బడ్జెట్ చిత్రంలో జోడి కట్టినా లాభం లేకపోయింది. సరే అయిందేదో అయ్యిందని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎగిరి గంతేసి ఒప్పుకుంటే అదేమో షూటింగ్ వాయిదాల వల్ల ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండిపోయింది. అలాని నిరాశపడే అవసరం పడలేదు.
ప్రభాస్ ది రాజా సాబ్ లో ఆఫర్ మరో మెట్టు ఎక్కించింది. మాళవిక మోహనన్ ఉన్నప్పటికీ నిధి అగర్వాల్ కు సైతం దర్శకుడు మారుతీ ప్రాధాన్యం ఉండేలా పాత్రను డిజైన్ చేయించాడు. కట్ చేస్తే 2025లో ఈ అమ్మడు అతి తక్కువ గ్యాప్ లో ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో దర్శనం ఇవ్వబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాలు తిరగడం ఆలస్యం ఏప్రిల్ 10న ది రాజా సాబ్ థియేటర్లకు వచ్చేస్తుంది. ఈ రెండింటికి ప్రధాన భాషలు అన్నింటిలోనూ గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. వందల కోట్ల బిజినెస్ చేయబోతున్నారు.
బోనస్ ఏంటంటే తేజ సజ్జ మిరాయ్ స్పెషల్ సాంగ్ లోనూ నిధి అగర్వాల్ తళుక్కున మెరవనుంది. ఇప్పటికే షూట్ అయిపోయిందట. ఇది ఏప్రిల్ 18 ప్రేక్షకుల ముందు రానుంది. అంటే మొత్తం 20 రోజుల నిడివిలో మూడు సినిమాలంటే మాములు విషయం కాదు. రాజా సాబ్, మిరాయ్ రెండు సినిమాల నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడం దీనికి దోహదపడి ఉండొచ్చు. ఇవి కాకుండా నిధి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. పవన్, ప్రభాస్ లతో డబుల్ ప్రమోషన్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అదే జరిగితే ఒక్కసారిగా ఆఫర్ల వర్షం కురుస్తుందని ప్రత్యేకంగా వేరే చెప్పాలా.
This post was last modified on %s = human-readable time difference 4:03 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…