తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన కాసిన్ని జనాలు కూడా ఏముందబ్బా రొటీనే కదా అనుకున్నారు. హక్కులు తీసుకున్న నిర్మాత దిల్ రాజు సైలెంటయ్యారు. కట్ చేస్తే తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యిందన్న సంగతి తెలిసి టీవిలో చూసిన ఆడియన్స్ బోలెడున్నారు. ముఖ్యంగా ప్రైమ్ లో డబ్బింగ్ వెర్షన్ వచ్చాక కోట్లాది వ్యూస్ వచ్చి పడ్డాయి. నచ్చిన శాతం కూడా భారీగానే ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ దీన్నే ఉస్తాద్ భగత్ సింగ్ గా రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించడంతో అదింకా భారీగా పెరిగింది.
దీని సంగతలా ఉంచితే తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ టీజర్ కం ట్రైలర్ ఇందాకా వచ్చేసింది. విజువల్స్ గట్రా గ్రాండ్ గా ఉన్నాయి. ఒరిజినల్ తో పోల్చుకుంటే బడ్జెట్ చాలా పెంచారు. యాక్షన్ ఎపిసోడ్స్ దానికన్నా మెరుగ్గా కనిపిస్తున్నాయి. అయితే ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే ఆర్డర్ పెద్దగా మార్చినట్టు కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో బేకరి నడుపుకునే హీరో, తల్లి లేని చిన్న పాప, అక్కడ సెకండ్ హీరోయిన్ తో పరిచయం కం ప్రేమ, లోకల్ గూండాలతో గొడవ, అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లి విలన్ జాకీ శ్రోఫ్ తో శత్రుత్వం ఎలా మొదలైంది లాంటి ఎపిసోడ్స్ తో తేరిని దాదాపు యధాతథంగా ఫాలో అయ్యారు.
ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా ఉండబోవడం లేదు. హరీష్ శంకర్ కీలకమైన మార్పులు బోలెడు చేశాడు. గబ్బర్ సింగ్ తరహాలో తనదైన ఎంటర్ టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేశాడని ఇప్పటికే టాక్ ఉంది. సో బేబీ జాన్ చూసినా సరే పవన్ కళ్యాణ్ అదే పాత్రలో కొత్తగా కనిపిస్తాడని అంచనా వేయొచ్చు. హరిహరా వీరమల్లు, ఓజి తర్వాత దీనికి డేట్లు ఇవ్వబోతున్న ఏపీ డిప్యూటీ సిఎంని కొత్తగా వచ్చిన పొలిటికల్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని అదనపు హంగులు జోడించబోతున్నారట. మిస్టర్ బచ్చన్ షాక్ నుంచి కోలుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నాడు.
This post was last modified on November 4, 2024 2:51 pm
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…