కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారు. దానికి ఉదాహరణగా మొన్నా నిన్నటి స్టార్లలో చిరంజీవి, రవితేజ లాంటి పేర్లు గుర్తొస్తే ఇప్పటి జనరేషన్ లో న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ ఛాయస్ అవుతాడు. బాపు గారి రాధాగోపాళం టీమ్ లో అసిస్టెంట్ గా పని చేసి, అష్టా చెమ్మా లాంటి అంచనాలు లేని చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు దసరా, సరిపోదా శనివారంతో వంద కోట్ల గ్రాసర్లు సాధించే దాకా తను అందుకున్న మైలురాళ్ళు అశేష అభిమానులను సంపాదించిపెట్టాయి.
మనకు నాని ఎలాగో కోలీవుడ్ కు శివ కార్తికేయన్ అలా అయిపోయాడు. ఇటీవలే విడుదలైన అమరన్ కేవలం మూడు రోజులకే వంద కోట్ల గ్రాస్ దాటే స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం చూసి ట్రేడ్ నివ్వెరపోయింది. ఎందుకంటే అతనికి గతంలో ఈ మార్కు చేరుకోవడానికి కనీసం పది రోజులు పట్టేది. కానీ ఇప్పుడు విజయ్, అజిత్ రేంజ్ లో ఇంత వేగంగా రికార్డులు నమోదు చేయడం చూసి ఫ్యాన్స్ చిన్న తలపతి అంటూ కొత్త బిరుదులు ఇచ్చేస్తున్నారు. శివకార్తికేయన్ సైతం యాంకర్, సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభంలో చాలా ఎగుడుదిగుడులు చూసి ఆ స్థాయి నుంచి కమల్ హాసన్ నిర్మాతగా సినిమాలు చేసే రేంజుకు చేరుకున్నాడు.
నాని, శివకార్తికేయన్ ల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత కష్టపడే మనస్తత్వం. ఇప్పుడిదే అందలం ఎక్కిస్తోంది. నాని ఇటీవలే సరిపోదా శనివారం రూపంలో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించగా ఇప్పుడు తన స్నేహితుడు కూడా అమరన్ తో అంతకు మించిన సక్సెస్ అందుకుంటున్నాడు. గత కొన్నేళ్లలో ఒక్క ప్రిన్స్ మాత్రమే శివ కార్తికేయన్ ని నిరాశపరిచింది. డాక్టర్, డాన్. మావీరన్ విజయం సాధించగా అయలన్ కమర్షియల్ గా తమిళనాడులో సక్సెసయ్యింది. ఇప్పుడు అన్నింటిని మించి అమరన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతోంది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి పిలిచి అభినందించేంత.
This post was last modified on November 4, 2024 12:01 pm
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…