ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో సైతం తెల్లవారుఝామున 4 గంటలకే ప్రీమియర్లు వేసేందుకు సిద్ధపడుతున్నారంటే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఏకంగా రెండు వేల కోట్లు వసూలు చేసే సత్తా దీనికి ఉందని గతంలో స్టేట్ మెంట్ ఇవ్వడం ఎంత వైరలయ్యిందో చూశాం. నార్త్ నుంచి సౌత్ దాకా ఒక రౌండ్ ప్రమోషన్లు పూర్తి చేసిన సూర్య ఇప్పుడు రెండో స్పెల్ కు సిద్ధపడుతున్నాడు. హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు మరికొన్ని వేడుకలు ప్లాన్ చేస్తున్నారు.
సరే టాక్ ఎలా ఉండబోతున్నా కంగువకు చేతిలో ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కారణం డిసెంబర్ 5 పుష్ప 2 ది రూల్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోగానే వీలైనంత రాబట్టుకుని లాభాల పంట పండించాలి. అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ మీద ఎంత హైప్ ఉందో చూస్తున్నాం. ఇప్పటినుంచే అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల కోసం బయ్యర్లకు ఫోన్లు వస్తున్నాయటనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి పుష్ప 2 ది రూల్ కి కనివిని ఎరుగని గ్రాండ్ రిలీజ్ ని రెడీ చేస్తున్నారు. కేరళ, కర్ణాటకలో మతిపోయే ఓపెనింగ్స్ రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో కంగువ బ్రహ్మాండంగా ఉన్నా సరే మూడో వారంలో అడుగు పెట్టే నాటికి ఫైనల్ రన్ కు దగ్గరవ్వాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్, లాభాలు వగైరా ఆ గ్యాప్ లోనే జరిగిపోవాలి. సిరుతై శివ దర్శకత్వం వహించిన కంగువలో దిశా పటాని హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద ఇప్పటికే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. వందల సంవత్సరాల క్రితం ఒక అడవిలో రెండు జాతుల మధ్య జరిగిన ఆధిపత్య పోరుని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న శివ చివరి ఇరవై నిమిషాల్లో వర్తమానం చూపించబోతున్నాడు. కంగువ 2ని రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తారు.
This post was last modified on November 4, 2024 2:51 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…