చాలా గ్యాప్ తర్వాత ఒక వీకెండ్ మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం దీపావళికి జరిగింది. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా, వందల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్యాన్ ఇండియా మూవీస్ రాకపోయినా కంటెంట్ ఉంటే చాలానే తెలుగు ప్రేక్షకుల అభిరుచి మరోసారి బయటపడింది. పండక్కు రిలీజైన నాలుగు సినిమాల్లో మూడింటికి పాజిటివ్ టాక్ రావడంతో బయ్యర్ల ఆనందం అంతా ఇంతా కాదు. లక్కీ భాస్కర్ క్రమంగా స్పీడ్ పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని బలంగా లాగుతోంది. మనీ క్రైమ్ జానర్ కొత్తే అయినప్పటికీ దర్శకుడు వెంకీ అట్లూరి తీర్చిదిద్దిన విధానం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఊహించిన దానికన్నా ఎక్కువ అరాచకం ‘క’ చేస్తోంది. మొదటి రోజు పరిమిత స్క్రీన్లతో ఇబ్బంది పడ్డ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక్కసారిగా పుంజుకుని శని ఆదివారాల్లో భారీ ఎత్తున స్క్రీన్లు షోలు పెంచేసుకుంది. బఘిరకు కేటాయించిన వాటిలో అత్యధికం ‘క’కే ఇచ్చేశారు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో టికెట్ ముక్క లేదనే తరహాలో జనం పోటెత్తిపోయారు. సరైన వసతులు లేని కొన్ని థియేటర్లు క జనంతో పండగ శోభను తెచ్చుకున్నాయి. ఇక సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అమరన్ ఎమోషన్ ఆడియన్స్ ని విపరీతంగా కదిలించేసింది. ప్రమోషన్లు చేయకపోయినా మౌత్ టాకే పబ్లిసిటీగా మారిపోయింది.
ఇక బాలీవుడ్ రిలీజులు చూసుకుంటే భూల్ భూలయ్యా 3కి మల్టీప్లెక్సుల ఆదరణ బాగానే ఉంది. ఆక్యుపెన్సీలు యాభై నుంచి తొంభై శాతం మధ్య నమోదయ్యాయి. బోలెడు స్టార్లున్న సింగం అగైన్ నిరాశపరిచే దిశగా వెళ్తోంది. నిర్మాతలు పోస్టర్లలో పెద్ద నెంబర్లు వేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాదిలో తిరస్కరించినట్టు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి దివాలి టపాసులు ఈసారి పెద్ద శబ్దంతో పేలడం శుభ పరిణామం. ఈ వారం నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి కొత్త సినిమాలున్నప్పటికీ కిరణ్, దుల్కర్, శివకార్తికేయన్ జోరు మాత్రం కొనసాగేలా ఉంది.
This post was last modified on November 4, 2024 11:41 am
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…