కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ విడుదలకు ముందు అడ్డంకులు ఎదురవుతున్నాయి. శివ దర్శకత్వంలో యాక్షన్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను పదికి పైగా భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ విడుదలకు అంబానీ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ అడ్డుపడింది.
స్టూడియో గ్రీన్ సంస్థ ఇదివరకే అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించకపోవడంతో, మద్రాసు హైకోర్టును ఆశ్రయించి సినిమా విడుదల నిలిపివేయాలని రిలయన్స్ సంస్థ కోరింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ వంటి చిత్రాలను నిర్మించేందుకు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నుండి సుమారు రూ.99 కోట్లు రుణం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందులో సుమారు రూ.45 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు.
బ్యాలెన్స్ రూ.55 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందట, ఇప్పటికే ఇవ్వాల్సిన ఆ డబ్బు అందకపోవడంతో రిలయన్స్ సంస్థ ఈ చర్యకు దిగింది. ఈ నేపథ్యలో ‘కంగువా’ థియేట్రికల్ విడుదలను, అలాగే తంగలాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయకుండా తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని కోర్టును రిలయన్స్ కోరింది. ఈ కేసు జస్టిస్ కుమరేష్ బాబు ఎదుట విచారణకు రాగా, స్టూడియో గ్రీన్ నవంబర్ 7వ తేదీ వరకు సమయం కోరింది. అంతవరకు ‘కంగువా’ విడుదలను నిలిపి ఉంచాలని విన్నవించింది. కోర్టు నవంబర్ 7వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది.
This post was last modified on November 2, 2024 4:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…