మొన్న విపరీతమైన పోటీలో విడుదలైన అమరన్ తమిళంలో భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు కానీ తెలుగులోనూ అదీ టైటిల్ మార్చకుండా రిలీజ్ చేసినా ఇంత స్థాయిలో స్పందన రావడం చూసి నిర్మాతలు సైతం షాక్ అవుతున్నారు. మొదటి రోజే మార్నింగ్ షోలకు అడ్వాన్స్ ఫుల్స్ పడటం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోతుందనే క్లారిటీ వచ్చేసింది. కాంపిటీషన్ లో క, లక్కీ భాస్కర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ వాటికే మాత్రం తీసిపోకుండా ఇంకా చెప్పాలంటే కొన్ని సెంటర్లలో డామినేషన్ చూపించే స్థాయిలో అమరన్ అదరగొట్టాడు.
2022లో రిలీజైన ‘మేజర్’ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ మంచి విజయం సాధించింది. వసూళ్లు, ప్రశంసలు రెండూ దక్కాయి. మేజర్, అమరన్ రెండూ ఇద్దరు గొప్ప ఆర్మీ ఆఫీసర్ల కథలను అత్యున్నతంగా ఆవిష్కరించినవి. కాకపోతే ఒక తేడా ఏంటంటే మొదటిదాంట్లో హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్ పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ అమరన్ లో శివకార్తికేయన్ ని డామినేట్ చేసేలా సాయిపల్లవి కట్టిపడేసే పెర్ఫార్మన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. మేజర్ లోనూ ఈ ఎమోషన్ ఉన్నప్పటికీ హీరో, దర్శకుడు ఇద్దరే దాన్ని పంచుకున్నారు.
అమరన్ లో మాత్రం థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా వెంటపడే స్థాయిలో సాయిపల్లవి హృదయాలను బరువెక్కించింది. ఫైనల్ రన్ లో రెండు వందల కోట్ల గ్రాస్ సులభంగా దాటుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. వీకెండ్ ని పూర్తిగా వాడుకోవడం ఖాయం. దెబ్బకు పోటీగా వచ్చిన జయం రవి బ్రదర్ ఎదురీదుతోంది. అమరన్ కు బ్లాక్ బస్టర్ ముద్ర పడిపోయింది. ఊహించని విషయం తెలుగులో దక్కుతున్న రన్. ఒకవేళ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోయి ఉంటే లక్కీ భాస్కర్, కలకు అదనపు థియేటర్లు దక్కేవి కానీ సాయిపల్లవి, శివ కార్తికేయన్ లు ఆ ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు.
This post was last modified on November 2, 2024 2:47 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…