Movie News

తెరనిండా స్టార్లు….కానీ ఏం లాభం

బాలీవుడ్ అతి పెద్ద మల్టీ స్టారర్ గా ప్రమోషన్లు చేసుకుంటూ భూల్ భులయ్యా 3 క్లాష్ వివాదం వల్ల ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సింగం అగైన్ నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. టైటిల్ రోల్ అజయ్ దేవగనే అయినప్పటికీ బోలెడు హీరో హీరోయిన్లను జొప్పించడంతో మాస్ పరంగా దీని మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2022లో సర్కస్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు రోహిత్ శెట్టి గ్యాప్ తీసుకుని ఈ కథ రాసుకున్నాడు. బడ్జెట్ విపరీతంగా ఖర్చు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ థియేటర్లు దక్కాయి.ఇక్కడిదాకా బాగానే ఉంది కదూ.

అసలు మ్యాటర్ మాత్రం తేలిపోయింది. రామాయణంని ఆధునిక పోలీస్ ఆఫీసర్ల హీరోయిజంతో ముడిపెట్టాలని చూసిన రోహిత్ శెట్టి బిర్యానిలో ఓ టన్ను మాసాలా వేస్తే చాలనుకున్నాడు కానీ అసలైన వంటకానికి అవసరమైన ఇతర దినుసులను సరిగా బ్యాలన్స్ చేయకపోవడంతో సింగం అగైన్ ఒక మాములు మూవీగా మారిపోయింది. శ్రీలంకలో ఉండే డేంజర్ లంక (అర్జున్ కపూర్) మాఫియాని కట్టడి చేయడానికి బాజీరావ్ సింగం (అజయ్ దేవగన్) పూనుకుంటాడు. ఇతను లంకకు స్వయానా తాత. దీంతో సింగం భార్య (కరీనా కపూర్) కిడ్నాప్ కు గురవుతుంది. ఆ తర్వాత జరిగేది ఈజీగా ఊహించుకోవచ్చు.

క్రమం తప్పకుండా ఎపిసోడ్స్ ప్రకారం అజయ్ దేవగన్, టైగర్ శ్రోఫ్, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పరిచయం కావడం ఆ తర్వాత ఫైట్లు చేయడం, మధ్యలో విలన్ తాలూకు బిల్డప్ సీన్లు వచ్చి పోవడం, సింగం వేసే ఎత్తులు చిత్తులు ఇలా ఫార్ములా ప్రకారం ఎక్కడా కొత్తదనం అనే ప్రశ్నే లేకుండా పరమ రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు రోహిత్ శెట్టి. హోరెత్తిపోయే పాటలు, బీజీఎమ్ ఇవ్వడంలో తమన్, రవి బస్రూర్ కొంతవరకు తోడ్పడ్డారు కానీ క్రియేటివిటీ జాడే లేని సింగం అగైన్ ని ఎలాంటి కొత్తదనం ఆశించకుండా వెళ్తే తప్ప మచ్చుకు కూడా మెప్పించదు.

This post was last modified on November 2, 2024 10:20 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

49 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

57 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago